‘నేను రామ్‌కి సపోర్ట్‌గా, అలాగే RRR ఫ్యామిలీలో భాగం అయ్యేందుకు ఇక్కడ ఉన్నాను. కొంచెం భయపడుతున్నాను కానీ ఇక్కడ ఉండటం చాలా అద్భుతంగా ఉంది’ అని అన్నారు ఉపాసన .

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ రావడంతో దేశం మొత్తం పులకించిపోతుంది. ఆస్కార్ అందుకున్న సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక స్టేజిపై నాటు నాటు పాట పెర్ఫామెన్స్ ఇస్తున్నప్పుడు మొత్తం థియేటర్ దద్దరిల్లింది. ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ గెలుచుకుని కోట్లాది భారతీయులను గర్వపడేలా చేసింది. అయితే ఈ సందర్భంలో రామ్ చరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

దర్శకుడు రాజమౌళి రూపొందించిన RRR.. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు దక్కని గౌరవాన్ని సొంతం చేసుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకల్లో ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ అవార్డ్ గెలుపొందగా.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లిరిసిస్ట్ చంద్రబోస్ ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని అందుకున్న క్షణం కోట్లాది భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. . ఇక RRR స్టార్ రామ్ చరణ్ .. తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై తళుక్కుమన్నారు.

ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై నడిచిన రామ్ చరణ్, ఉపాసన.. ‘నాటు నాటు’ బెస్ట్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ గెలవడానికి ముందు హోస్ట్‌తో మాట్లాడారు. గోల్డెన్ గ్లోబ్స్ నుంచి అకాడమీ అవార్డ్స్ వరకు సాగిన ఈ జర్నీకి తమకు పుట్టబోయే బిడ్డ అదృష్టాన్ని తెచ్చిపెట్టినట్లుగా భావిస్తున్నామన్నారు. అయితే రెడ్ కార్పెట్‌పై భర్త చరణ్‌తో కలిసి పాల్గొనడంపై ఉపాసన తన ఫీలింగ్స్ పంచుకున్నారు. ట్విట్టర్‌లో అభిమాని ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియోలో ఈ విధంగా స్పందించారు.

‘నేను రామ్‌కి సపోర్ట్‌గా, అలాగే RRR ఫ్యామిలీలో భాగం అయ్యేందుకు ఇక్కడ ఉన్నాను. కొంచెం భయపడుతున్నాను కానీ ఇక్కడ ఉండటం చాలా అద్భుతంగా ఉంది’ అని అన్నారు ఉపాసన . ఇదే క్రమంలో రామ్ జోక్యం చేసుకుంటూ.. ఆమె ఆరు నెలల గర్భవతి అని చెప్పారు . ‘గోల్డెన్ గ్లోబ్స్ నుంచి ఇక్కడ మీతో నిలబడే వరకు.. ఈ జర్నీకి మాకు పుట్టబోయే బిడ్డనే అదృష్టాన్ని తీసుకొస్తోందని అనుకుంటున్నాను’ అన్నారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్.. బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్స్‌లో కనిపించగా, ఉపాసన క్రీమ్ డిజైనర్ చీరలో మెరిసిపోయింది. . ఇక RRR చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత RRR టీమ్ ట్విట్టర్ హ్యాండిల్ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ అద్భుతమైన క్షణాలను వర్ణించేందుకు మాటలు లేవంటూ వరల్డ్ వైడ్ అభిమానులందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఇక అవార్డు అందుకున్న కీరవాణి.. ప్రతి భారతీయుడి గర్వం తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని అన్నారు.

Updated On 13 March 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story