మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్(Ram charan) వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య, కూతురుతో కలిసి ఇటలీ(Italy) పర్యటనలో ఉన్నాడు. అక్కడ్నుంచే ఓ వీడియోకాల్‌లో కొందరికీ సారీ చెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. రామ్‌చరణ్ ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది? ఆయన ఎవరికి క్షమాపణలు చెప్పాడు?

Ram Charan

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకు గుర్తింపు దక్కింది. పలు అంతర్జాతీయ అవార్డులను కూడా ఆ సినిమా గెల్చుకుంది. దాంతో అందులో నటించిన రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లకు(NTR) బాగా గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమానికి హాజరవుతూనే ఉంది. లేటెస్ట్‌గా మన దేశంలో జర్మనీ యూనిటీ డే(German Unity Day) సెలెబ్రేషన్స్ జరిగాయి. ఆర్‌ఆర్‌ఆర్(RRR) టీమ్ తరపున సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani) ఆ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీరవాణి నాటు నాటు పాటను జర్మనీలో పాడారు. దీనికి వేడుకలో ఉన్న జర్మనీ ఎంబసీ అధికారులు డ్యాన్సులు చేశారు. అయితే తాను వ్యక్తిగత పనుల మీద ఇటలీకి వెళ్లానని, తను రాలేకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నానని వీడియోకాల్‌లో రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శంకర్(Shankar) దర్శకత్వంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్(Game changer) సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.