ఆర్ఆర్ఆర్(RRR) తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్(ram charan) దాంతో ఆయన నెక్ట్స్ సినిమాలపై అంచనాలుభారీగా పెరిగిపోయాయి. ఆస్కార్(Oscar) రేంజ్ కు వెళ్ళడంతో.. చరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. హాలీవుడ్(Hollywood) లో కూడా ఆయనతో సినిమాలు తీయ్యడానికి రెడీ అవుతున్నారంటే..
ఆర్ఆర్ఆర్(RRR) తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్(ram charan) దాంతో ఆయన నెక్ట్స్ సినిమాలపై అంచనాలుభారీగా పెరిగిపోయాయి. ఆస్కార్(Oscar) రేంజ్ కు వెళ్ళడంతో.. చరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. హాలీవుడ్(Hollywood) లో కూడా ఆయనతో సినిమాలు తీయ్యడానికి రెడీ అవుతున్నారంటే.. రామ్ చరణ్ ఎంతలాప్రభావం చూపించారో తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్(shankar) డైరెక్షన్ లో గేమ్ చేంజర్(game changer) సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ఎండింగ్ లో ఉంది. మెగా పవర్ స్టార్ భార్య ఉపాసన(upasana) ప్రగ్నెంట్ తో ఉండటంతో.. ఆమె డెలివరీ వరకూ షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట చరణ్. ఇక ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తుండగా.. కియారా అద్వాని(Kiara advani) చరణ్ జోడీగా రెండో సారి నటిస్తోంది. ఈమూవీ తరువాత చేయబోయే సినిమా కు కూడా చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
గేమ్ చేంజర్ సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీ బుచ్చిబాబుసానకు(buchi babu) ఛాన్స్ ఇచ్చాడు చరణ్. ఇక ఈమూవీపై కూడా ఫ్యాన్స్ ఎంతో ఇంట్రస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ లో అంచనాలుపెంచేశాడు.. ఇక బుచ్చిబాబుతో సినిమా పట్ల చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నానని అన్నారు ఓ సందర్భంలో చరణ్. ఇక ఇందులోతాను ఎంతోమందికి స్పూర్తి కలిగించే పాత్రలో కనిపించబోతున్నానని రీసెంట్ గా అన్నాడు రాంచరణ్. ఇక ఈ మధ్య ఈసినిమాపై మరో అప్ డేట్ వినిపిస్తోంది.
తాజాగా రామ్ చరణ్ సినిమాకు సబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆర్‌సీ 16లో(RC16) రాంచరణ్ ఉత్తరాంధ్ర కుర్రాడిగా నటించబోతున్నాడట. దాని కోసం అచ్చమైన ఉత్తరాంద్ర మాండలికంలో ఆయన మాట్లాడాల్సి ఉందట. అది అంత ఈజీ కాకపోవడంతో.. చరణ్ పట్టుదలతో ఉండగా.. దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు రాంచరణ్ తన బాడీ లాంగ్వేజ్‌తోపాటు ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం కసరత్తులు చేయబోతున్నాడట. రాంచరణ్ నటించిన రగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సారి ఏకంగా మెగాఫోన్ పట్టనుండటంతో ఈసినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.