మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Mega Powerstar Ram Charan) అన్నారని కాదు కానీ నిజంగానే షూటింగ్ లోకేషన్స్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన పని లేదు. మన దేశంలో అద్భుతమైన లోకేషన్స్ ఉన్నాయి. ట్రిపులార్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకులకు చాలా దగ్గరైన రామ్‌చరణ్ ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతున్న జీ-20 సదస్సులో పాల్గొంటున్నారు. భారతీయ సినీరంగం (Indian Cinema) తరఫున ప్రతినిధిగా రామ్‌చరణ్ పాల్గొంటున్నారు. కాశ్మీర్ (Kashmir) వంటి రమణీయమైన ప్రదేశంలో సదస్సు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు రామ్‌చరణ్.

ramc haran g2o summit
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Mega Powerstar Ram Charan) అన్నారని కాదు కానీ నిజంగానే షూటింగ్ లోకేషన్స్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన పని లేదు. మన దేశంలో అద్భుతమైన లోకేషన్స్ ఉన్నాయి. ట్రిపులార్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకులకు చాలా దగ్గరైన రామ్‌చరణ్ ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతున్న జీ-20 సదస్సులో పాల్గొంటున్నారు. భారతీయ సినీరంగం (Indian Cinema) తరఫున ప్రతినిధిగా రామ్‌చరణ్ పాల్గొంటున్నారు. కాశ్మీర్ (Kashmir) వంటి రమణీయమైన ప్రదేశంలో సదస్సు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు రామ్‌చరణ్. భారతదేశంలో మనోహరమైన లోకేషన్స్ ఉన్నాయని చెప్పారు. విదేశాల కంటే ఇక్కడే సుందరమైన ప్రదేశాలున్నాయన్నారు. మన దేశ అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచన ఉందని, ఇక నుంచి తన సినిమా షూటింగ్స్ అన్నీ భారత్‌లోనే జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. కేవలం లొకేషన్‌ల కోసం విదేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని, భవిష్యత్తులో తాను హాలీవుడ్ సినిమాలో భాగమైనా భారత్‌లో మాత్రమే షూటింగ్ జరపాలనే షరతు పెడతానని రామ్‌చరణ్ స్పష్టం చేశారు. ఇంతకు ముందు దక్షిణ భారత సినీ పరిశ్రమ, ఉత్తర భారత సినీ పరిశ్రమ అనే తేడాలు ఉండేవేమోగానీ, ఇప్పుడా భేదాలే లేవన్నారు. పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా రావడానికి ఇదే కారణమని రామ్‌చరణ్ తెలిపారు.
