రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువైపోయింది ఈమధ్య. స్టార్ హీరోల బర్త్ డేలను సెలబ్రేట్ చేసుకోవడం కోసం.. వారి లాండ్ మార్క్ మూవీస్ ను రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్.. ఈరకంగా కూడా కలెక్షన్స్ సాధించుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్ ఆరేంజ్ మూవీ కూడా రీ రిలీజ్ కాబోతోంది.

ప్లాప్ టాక్ మూటగట్టుకున్నా కాని.. రామ్ చరణ్ కెరీర్ లో మర్చిపోలేని సినిమా ఆరేంజ్. అది సక్సెస్ అయ్యిందా.. ప్లాప్ అయ్యిందా అనేది తరువాత సంగతి కాని.. ఈసినిమా వల్ల చరణ్ కు మంచి ఇమేజ్ వచ్చింది. ఈసినిమా పాటలతో యూత్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. పదమూడేళ్ల క్రితం వచ్చిన ఈసినిమా.. ప్రేమికులకు వరంగా మారింది. ఈ పాటలతో అమ్మాయిలను ఇప్రెస్ చేసేవారు అబ్యాయిలు. హరీస్ జయరాజ్ మ్యూజిక్ తో ఒక ఊపు ఊపేసింది సినిమా. అప్పటికి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి ఆరెంజ్ సాంగ్స్.

కాకపోతే సినిమాలో లైన్ అర్ధం అవ్వక ఆరెజ్ ప్లాప్ అయ్యింది. మగధీరాలో ధీరుడిగా రామ్ చరణ్ ను చూసి... ఆరెంజ్ లో ఈ గెటప్ లో ఆడియన్స్ చూడలేకపోయారు. ఫ్యాన్స్ కూడా ఈ పాత్రను యాక్సప్ట్ చేయలేకపోయారు. దాంతో ఆరెంజ్ సినిమా ఆవరేజ్ గానే నిలిచింది. అది కూడా పాటలవల్ల యావరేజ్ అయ్యింది. అవికూడా లేకుంటే ప్లాప్ పిక్స్ అయ్యేది. ఈ సినిమా ఫెయిల్యూర్ వల్ల నిర్మాత నాగబాబు నిండా మునిగారు. సూసైడ్ కూడా చేసుకోవాలి అనుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాని మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తనను కాపాడారాని నాగుబాబు చెప్పారు. ఇక ఈసినిమా వెనుక ఉన్న ఇంత కథ ఎందుకుకాని.. ఈమూవీ రిరిలీజ్ చేయబోతున్నట్ట తెలుస్తోంది. .

ఈనెల 27న రామ్ చరణ్ భర్త్ డే సందర్భంగా ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోసారి మెగా ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది ఆరేంజ్. అయితే ఈసినిమాను ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేసి.. సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్స్ ను జనసేన పార్టీ ఫండ్ గా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత సాయి రాజేష్. దీంతో మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో చరణ్ జోడీగా జెనీలియా నటించి మెప్పించింది. ఈసినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. ప్రస్తుతం ఆస్కార్ సాధించిన ఉత్సాహంలో ఉన్నారు చరణ్. ఈసారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపించాలి అని చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ టైమ్ లో ఆరేంజ్ సినిమా రిలీజ్ చేస్తే స్పందన ఎలా ఉంటుంది అనేది కూడా బేరీజు వేసుకుంటున్నారు టీమ్. మరి చూడాలి చరణ్ బర్త్ డేకు ఇంకెన్ని సర్ ప్రైజ్ లు వస్తాయో.

Updated On 18 March 2023 5:37 AM GMT
Ehatv

Ehatv

Next Story