ది ఇండియా హౌస్ (The India House) చిత్రాన్ని ఒక మంచి లవ్ స్టోరీగా తెరకెక్కించబోతున్నారు డెబ్యూ డైరెక్టర్ రామ్ వంశీ కృష్ణ (Ram Vamsi Krishna). ఈ కాన్సెప్ట్ వీడియోలో నిఖిల్ క్యారెక్టర్‌ను శివగా పరిచయం చేశారు. శివ థేమ్స్ నది మీద ఒకచిన్న పడవలో వెళ్తున్నట్టు.. ఇండియా హౌస్‌కి చేరుకునేసరికి అప్పటికే అది కాలి బూడిదైనట్టు చూపించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram Charan), యూవీ క్రియేషన్స్‌తో(UV Creations) కలిసి విమెగా పిక్చర్స్ బ్యానర్‌ను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రొడక్షన్ హౌస్‌లో టాలెంటెడ్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు పక్కా ప్లాన్ సిద్దం చేసుకున్నారు. అయితే ఈ బ్యానర్లపై ఫస్ట్ ప్రాజెక్ట్‌గా నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddhartha)తో సినిమా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్ని లాంచ్ చేశారు రామ్ చరణ్. ది ఇండియా హౌస్ (The India House) అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు అంటే 1905లో లండన్‌లో ఇండియన్ స్టూడెంట్స్ ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం ది ఇండియా హౌస్‌ని నడిపేవాళ్లు. ఇండియా హౌస్‌లో జరిగిన ఉద్యమం గురించి ఇండియన్ హిస్టరీలో ఎక్కడా లేదు. ఆ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకుని ఈ సినిమాను తీయబోతున్నారు.
ది ఇండియా హౌస్ (The India House) చిత్రాన్ని ఒక మంచి లవ్ స్టోరీగా తెరకెక్కించబోతున్నారు డెబ్యూ డైరెక్టర్ రామ్ వంశీ కృష్ణ (Ram Vamsi Krishna). ఈ కాన్సెప్ట్ వీడియోలో నిఖిల్ క్యారెక్టర్‌ను శివగా పరిచయం చేశారు. శివ థేమ్స్ నది మీద ఒకచిన్న పడవలో వెళ్తున్నట్టు.. ఇండియా హౌస్‌కి చేరుకునేసరికి అప్పటికే అది కాలి బూడిదైనట్టు చూపించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ప్యాన్ ఇండియా ఫీల్‌ను కలిగిస్తుంది. ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నిషియన్ అయిన కామెరాన్ బ్రైసన్ సినిమాటోగ్రీఫీ అందిస్తున్నారు.