ఉపాసన యొక్క మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ తన Instagram లో ఈ ఘటనకు సంబంధించి తాను అప్సెట్ అయ్యానంటూ పోస్టు పెట్టారు.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకల గురించి దేశమంతా మాట్లాడుకుంటూ ఉంది. సల్మాన్, షారూఖ్, అమీర్‌ల త్రయం RRR సినిమాకు సంబంధించి “నాటు నాటు” పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వేడుకకు హాజరైన రామ్ చరణ్‌ను షారుఖ్ ఖాన్ డ్యాన్స్ చేయడానికి రమ్మని వేదిక మీదకు ఆహ్వానించారు. అయితే, రామ్‌ చరణ్ ని ‘ఇడ్లీ’ అని సరదాగా కింగ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్ లో విమర్శలకు దారి తీశాయి. షారుఖ్ ఖాన్‌ రామ్ చరణ్ ను అవమానించారని పలువురు నెటిజన్లు షారుఖ్ పై తిట్ల దండకాన్ని మొదలుపెట్టారు.

ఉపాసన యొక్క మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ తన Instagram లో ఈ ఘటనకు సంబంధించి తాను అప్సెట్ అయ్యానంటూ పోస్టు పెట్టారు. అటువంటి వ్యాఖ్యల కారణంగా రామ్ చరణ్ ను అగౌరవపరిచారని.. రామ్ చరణ్ పట్ల ఇంత అగౌరవం చూసి తాను ఈవెంట్ నుంచి వాకౌట్ చేశానని చెప్పింది. దక్షిణ భారత తారలను అగౌరవపరిచే బాలీవుడ్ ధోరణి గురించి నెటిజన్లు చర్చిస్తూ ఉన్నారు. షారుఖ్ ఖాన్ తన వ్యాఖ్యలను హాస్యాస్పదంగా భావించి ఉండవచ్చని కొందరు అంటుండగా.. చాలా మంది అది ఒక హద్దు దాటిందని భావించారు. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులలో కూడా అసౌకర్యాన్ని కలిగించింది. "ఇడ్లీ" అనే పదం వంటి దక్షిణ భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయమని.. కానీ వేదిక మీద షారుఖ్ ఖాన్ అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడ్డారు.

Updated On 4 March 2024 9:20 PM GMT
Yagnik

Yagnik

Next Story