తమిళ సూపర్‌స్టార్‌ దళపతి విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ చిత్రం లియో.. ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నారు. ఇందులో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీపావళి పండుగ కానుకగా అక్టోబర్‌ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమిళ సూపర్‌స్టార్‌ దళపతి విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ చిత్రం లియో.. ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నారు. ఇందులో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీపావళి పండుగ కానుకగా అక్టోబర్‌ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ అగ్రహీరో ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించనున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీ క్లయిమాక్స్‌లో ఆ హీరో పాత్ర కథాగమనాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటుందని చిత్ర బృందం చెప్పిన మాట. తాజా సమాచారం ప్రకారం గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఆ గెస్ట్‌ రోల్‌లో నటించబోతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఒకవేళ రామ్‌చరణ్‌ ‘లియో’ సినిమాలో భాగమైతే పాన్‌ ఇండియా స్థాయిలో రీచ్‌ ఉంటుందనేది దర్శకనిర్మాతల ఆలోచనగా చెబుతున్నారు. ఇదే నిజమైతే సినిమా మామూలుగా ఉండదు. రామ్‌చరణ్ అతిథి పాత్రలో నటిస్తున్నారన్న విషయం చిత్రబృందం నుంచి అధికారికంగా రావాల్సి ఉంది..

Updated On 5 July 2023 1:00 AM GMT
Ehatv

Ehatv

Next Story