ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమాతో పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan) ప్రస్తుతం తన ఫ్యూచర్‌ ప్రాజెక్టుల విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎన్నిక(Elections) విషయంలో అందుకు తగ్గట్టే అడుగులు వేస్తున్నారు రామ్‌చరణ్‌. ఉప్పెన(Uppena) సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన బుచ్చిబాబు(Buchibabu Sana) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ సినిమా ఒప్పుకున్న విషయం తెలిసిందే.

ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమాతో పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan) ప్రస్తుతం తన ఫ్యూచర్‌ ప్రాజెక్టుల విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎన్నిక(Elections) విషయంలో అందుకు తగ్గట్టే అడుగులు వేస్తున్నారు రామ్‌చరణ్‌. ఉప్పెన(Uppena) సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన బుచ్చిబాబు(Buchibabu Sana) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ సినిమా ఒప్పుకున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబుతో పాటు లోకేశ్‌ కనకరాజ్‌(Lokesh Kanakaraj), ప్రశాంత్‌ నీల్(Prashanth Neel), సుకుమార్‌లు(sukumar) కూడా రామ్‌చరణ్‌ కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వీరి సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే రామ్‌చరణ్‌ కొత్త సినిమా గురించి సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలో రామ్‌చరణ్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) బయోపిక్‌లో నటించనున్నట్టు ఫిలింనగర్‌లో వినిపిస్తున్న మాట! విరాట్‌ కోహ్లీ జీవిత గాధ ఆధారంగా సినిమా తీయాలని ఇంతకు ముందు చాలా మంది ప్రయత్నించారు. చాలా మంది హీరోలు కూడా తెరపైకి వచ్చారు. చివరకు విరాట్‌ కోహ్లీగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారన్న వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా సంచలనంగా మారింది. విరాట్‌ కోహ్లి పుట్టినరోజైన నవంబర్‌ 5వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన విడుదల కాబోతున్నదట! సినిమాను ఎవరు నిర్మిస్తున్నారో, దీనికి దర్శకుడు ఎవరో త్వరలో తెలియనుంది. ఈ వార్త మాత్రం అటు కోహ్లీ అభిమానులకు, ఇటు చరణ్‌ అభిమానులకు సంతోషాన్ని ఇస్తోంది.

Updated On 7 Sep 2023 12:19 AM GMT
Ehatv

Ehatv

Next Story