గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా గేమ్ ఛేంజర్(Game Changer). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో దిల్‌రాజు(Dil Raju), శిరీష్(sirish) నిర్మిస్తున్న ఈ చిత్రంలోని జరగండి.. జరగండి అనే పాట ఇవాళ విడుదలయ్యింది.

Game Cahnger Song
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా గేమ్ ఛేంజర్(Game Changer). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో దిల్‌రాజు(Dil Raju), శిరీష్(sirish) నిర్మిస్తున్న ఈ చిత్రంలోని జరగండి.. జరగండి అనే పాట ఇవాళ విడుదలయ్యింది. రామ్‌చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పాటను విడుదల చేశారు మేకర్స్. జెంటిల్‌మన్ నుంచి మొన్నటి 2.0 వరకు ప్రతి సినిమాను ఓ విజువల్ వండర్‌లా తీర్చిదిద్దారు శంకర్. ఈయన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రామ్‌చరణ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని గేమ్‌ఛేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇవాళ రామ్‌చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.తమన్(SS Thaman) సంగీత సారథ్యం అందిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి.. జరగండి అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోన్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
