మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'గేమ్ చేంజర్' పైనే ఉంది. ఈసినిమా లేట్ అవ్వడంతో శంకర్ పై కోపంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. కనీసం అప్ డేట్ కూడా ఇవ్వకపోవడంతో.. గుర్రుగా ఉన్నారు. అయితే ఈహూవీ షూటింగం కు సబంధించిన కొత్త షెడ్యుల్ ను ప్లాన్ చేస్తున్నట్టు మాత్రం తెలుస్తోంది. నఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతూ వచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గేమ్ చేంజర్(Game Changer)షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. శంకర్(Shankar) అటు ఇండియన్2(Indian2) తో పాటు..ఇటు గేమ్ చేంజర్ రెండు సినిమాలు ఒకేసారి చేస్తుండటంతో.. షూటింగ్ లో ఇబ్బందికర పరిస్థితులు తప్పడంలేదు. ఈక్రమంలో గేమ్ చేంజర్ షూటింగ్ కు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'గేమ్ చేంజర్' పైనే ఉంది. ఈసినిమా లేట్ అవ్వడంతో శంకర్ పై కోపంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. కనీసం అప్ డేట్ కూడా ఇవ్వకపోవడంతో.. గుర్రుగా ఉన్నారు. అయితే ఈహూవీ షూటింగం కు సబంధించిన కొత్త షెడ్యుల్ ను ప్లాన్ చేస్తున్నట్టు మాత్రం తెలుస్తోంది. నఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతూ వచ్చింది. ఇక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తూ వచ్చారు.

ఇక రీసెంటుగా ఈ మూవీ షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేశారట టీమ్. నెక్ట్స్ షెడ్యుల్ కోసం కూడా అప్పుడే ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే దానికి తగిన సన్నాహాలు కూడా అయిపయాయని అంటున్నారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను మైసూర్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ కి సంబంధించిన చిత్రీకరణ మొదలవుతుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ షూట్ చేయనున్నారు. రాజకీయాలతో కూడిన యాక్షన్ మూవీగా ఈ సినిమాను శంకర్ రూపొందిస్తున్నాడు. నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు.

శంకర్ మార్క్ పాటలు .. సన్నివేశాలతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, కథానాయికగా కియారా అద్వాని అందాల సందడి చేయనుంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో శ్రీకాంత్ .. ఎస్. జె. సూర్య .. సునీల్ .. సముద్రఖని .. అంజలి కనిపించనున్నారు.

Updated On 22 Nov 2023 10:59 PM GMT
Ehatv

Ehatv

Next Story