శాక్రిఫైసింగ్ స్టార్(sacrifising star) సునిశిత్(sunishith) చాలా మందికి ఇతరు తెలుసు. మరి ఇంత తెలిసిన ఈ స్టార్ మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ దారుణంగా దాడి చేశారు. ఇంతకీ అతను చేసిన తప్పేంటి..?

Ram Charan Fans Fire On Sunishith
శాక్రిఫైసింగ్ స్టార్(sacrificing star) సునిశిత్(sunishith) చాలా మందికి ఇతరు తెలుసు. మరి ఇంత తెలిసిన ఈ స్టార్ మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ దారుణంగా దాడి చేశారు. ఇంతకీ అతను చేసిన తప్పేంటి..?
శాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్ సెలబ్రిటీల అవకాశాలు తన అవకాశాలుగా.. వారి బదులు నేను అక్కడ ఉండాల్సింది.. నేను త్యాగం చేయబట్టే అన్ని సినిమాలు అలా అంత మంది స్టార్లు చేశారు అన్నట్టుగా.. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు సునిశిత్. ఆయన ఇంటర్వ్యూలు సరదాగా నవ్వుకోవడానికే ఎక్కువగా చూస్తుంటారు ఫ్యాన్స్.. స్టార్ హీరోల గురించి సునిశిత్ మాట్లాడే మాటలు నిజంగా కామెడీగా ఉంటాయి. అటువంటిది... ఆయన కాస్త శృతి మించి మాట్లాడితే ఫ్యాన్స్ ఊరుకుంటారా..?
తాజాగా మెగా ఫ్యాన్స్ ను కెలికాడు సునిశిత్. ఏకంగా ఉపాసనపై(upasana) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తాను ఉపాసన కలిసి గోవా వెళ్లేవారం అంటూ.. డిఫరెంట్ గా మాట్లాడారు. దాంతో రామ్ చరణ్(Ram charan) ఫ్యాన్స్కు కోపం కట్టలు తెంచుకుంది.. వెంటనే సునిశిత్ ఇంటికి వెళ్ళి ఆయన్ను పట్టుకుని చితక్కొట్టారు. అతడి ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో వెళ్లిన చరణ్ ఫ్యాన్స్.. అతడిపై దాడి చేశారు. సునిశిత్‌తో క్షమాపణలు చెప్పించారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో సునిశిత్ మాట్లాడుతూ.. నమస్కారం అండి నా పేరు సునిశిత్.
తప్పుడు వ్యాఖ్యలు చేశాను. సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలు అని తెలియజేస్తున్నాను. పొరపాటు అయిపోయింది. నేను చేసిన తప్పుకు రామ్‌చరణ్‌గారి ఫ్యాన్స్ నన్ను కొట్టడం జరిగింది. ఇంకో సారి.. ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు ఎవరి గురించి కానీ, ఏ హీరో గురించి కానీ చేయను. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను. నన్ను క్షమించండి అన్నారు.
అంతే కాదు ఉపాసన వదినమ్మ గారికి, రామచరణ్ గారికి నా క్షమాపణలు. తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు గాను నేను బాధపడుతున్నాను అని పేర్కొన్నాడు. కాగా, సునిశిత్ గతంలోనూ చాలా వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.
