ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా హీరో. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తో గేమ్ చేంజర్(Game changer) సినిమా చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం స్పీడ్ అందుకుంది. మొన్నటి వరకూ బ్రేక్ లు వేసుకుంటూ సాగిన షూటింగ్ .. పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో ఈ మూవీ షెడ్యూల్ మైసూర్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈమధ్య ఫిల్మ్ స్టార్ సెలబ్రిటీలు వాడే వస్తువులు, కార్లు, కాస్ట్యూమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఫెరారీ కారు(Ferari Car) నెట్టింట వైరల్ అవుతోంది. దాని కాస్ట్ తెలిస్తే.. కళ్లు తిరగాల్సిందే మరి.

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా హీరో. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తో గేమ్ చేంజర్(Game changer) సినిమా చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం స్పీడ్ అందుకుంది. మొన్నటి వరకూ బ్రేక్ లు వేసుకుంటూ సాగిన షూటింగ్ .. పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో ఈ మూవీ షెడ్యూల్ మైసూర్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నాడు. రామ్ చరణ్ రెడ్ కలర్ ఫెరారీ కారులో(Red Ferari Car) సందడి చేశాడు. చరణ్ కు కార్లంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజ్ లో చిన్నపాటి కార్ల షోరూమే ఓపెన్ చేశాడు. అందులో కోట్లు విలువ చేసే కార్లు చాలా ఉన్నాయి. కార్లే కాదు.. గేమ్స్ అన్నా.. గుర్రాలు అన్నా చరణ్ కు చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా చరణ్ కి సంబంధించిన ఒక కారు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చరణ్ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న ఖరీదైన కార్లెన్నో ఉన్నాయి. అయితే అందులో చాలా స్పెషల్ గా నిలుస్తోంది. ఫెరారీ.

రామ్ చరణ్ తాజాగా ఫెరారీ పోర్టోఫినో అనే మోడల్ కారులో వెళ్తు కెమెరాకి చిక్కాడు. రెడ్ కలర్ ఫెరారి లో రామ్ చరణ్ తన ఇంట్లోకి వెళ్తుంటే ఎవరో వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు.ఇక అంతే నిమిషాల్లో ఆ వీడియో వైరల్ గా మారింది.ఆ వీడియో చూసిన వారందరు కారు మోడల్ సూపర్ గా ఉందని అంటున్నారు. ఇక సోషల్ మీడియా జనాలు ఆగుతారా.. కారు కాస్ట్ గురించి ఎంక్వైరీ చేయగా.. అంతా షాక్ అయ్యారు. ఆ కారు ఖరీదు అక్షరాలా 4 కోట్లు . ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Updated On 28 Nov 2023 8:12 AM GMT
Ehatv

Ehatv

Next Story