✕
Happy birthday Ram Charan : నిజంగానే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్..!
By EhatvPublished on 27 March 2023 1:11 AM GMT
మెగాపవర్ స్టార్ (Mega Power Star)కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మెగా పవర్ స్టార్‌కి ఈహా ఛానెల్, వెబ్సైట్ల యావత్తు సిబ్బంది, యాజమాన్యం హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి రామ్ చరణ్ (Ram Charan) ఎదిగిన విధానం, తెలుగు ప్రేక్షకులందరి మన్ననలకు పాత్రుడయ్యే విధానం చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కడుపున పుట్టడం ఒక రకంగా గొప్పయోగమైతే, ఎన్నో రకాలుగా అది సంక్లిష్టభరితమనే చెప్పాలి.

x
Ram charan Birthday
-
- మెగాపవర్ స్టార్ (Mega Power Star)కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మెగా పవర్ స్టార్‌కి ఈహా ఛానెల్, వెబ్సైట్ల యావత్తు సిబ్బంది, యాజమాన్యం హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి రామ్ చరణ్ (Ram Charan) ఎదిగిన విధానం, తెలుగు ప్రేక్షకులందరి మన్ననలకు పాత్రుడయ్యే విధానం చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కడుపున పుట్టడం ఒక రకంగా గొప్పయోగమైతే, ఎన్నో రకాలుగా అది సంక్లిష్టభరితమనే చెప్పాలి.
-
- పైగా ఇంకో వ్యాపారం, మరో వ్యాపకం అయితే అదో విధం. కానీ సినిమా పరిశ్రమలోకి హీరోగా రావడమన్నది పూలపాన్పు కాదు. ఎన్నో సందర్భాలలో అది ముళ్ళ కిరీటమే. నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమను ఉర్రూతలూపి, తెలుగు సినిమా బాక్సాఫీసు తలరాతనే తిరగరాసిన మెగాస్టార్ కుమారుడంటే ఎంతటి బరువైన బాధ్యత కొడుకు భుజాలపైన ఉంటుందో ఊహించనలవి కాదు.
-
- ప్రతీ అడుగులోనూ తండ్రితో పోలిక...ప్రతీ మలుపులోనూ తండ్రితో సాపత్యం. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే ఎంతో నిశితంగా, ఆచితూచి అడుగు వేయాలంటే ఎన్నో కోణాలలో రిస్క్ పొంచి ఉండే సమస్యాత్మక ప్రయాణం. మరి రామ్ చరణ్ (Ram Charan) ఈ ప్రయాణాన్ని ఎలా తనకి అనువుగా మార్చుకోగలిగారు. ఇదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
-
- మొదటి సినిమా ‘చిరుత’ (Chirutha) నుంచి రామ్ చరణ్ కెరీర్‌ని పరిశీలిస్తే ముఖ్యంగా కనిపించే అంశాలలో ప్రత్యేకంగా ఆవిష్కారమయ్యే విషయాలలో అత్యంత ప్రధానంగా రామ్ చరణ్ (Ram Charan) పాటించిన నిరాడంబరత, సహృదయత, చిత్రసీమతో సంఘీభావం, తోటివారి పట్ల నమ్రత, వినమ్రత, తాను మెగాస్టార్ తనయుడైనా సరే ఆ ఛాయలు ఎక్కడా పొడచూపకుండా, తనూ కొత్తగా సినిమా పరిశ్రమకు వచ్చిన అతి సామాన్యుడిలా మెలగగలగడం రామ్ చరణ్‌కి గణనీయమైన కీర్తి ప్రతిష్టలను మోసుకొచ్చాయి.
-
- సినిమాలు హిట్ అయినంత మాత్రాన వ్యక్తిగతమైన కీర్తిప్రతిష్టలకు అవి కొంత మేరవరకే దోహదపడతాయి. అసంఖ్యాకమైన అభిమానులు, లెక్క పెట్టలేనంత మంది పరిశ్రమ నిండా నిండిన త్రోవలో సినిమా హిట్స్ ఏమంత హెల్ప్ కావు. సినిమా హిట్ అయితే అది ఆ సినిమా వరకే. కానీ నిఖార్సయిన వ్యక్తిత్యం అన్ని విధాల కంచుకవచంలా కాపాడుతుంది.
-
- వరుస సినిమాలు, ఇండస్ట్రీ హిట్స్.... ఇటువంటి వాటికి అతీతంగా రామ్ చరణ్ (Ram Charan) తన బ్రతుకు బాటని చక్కదిద్దుకోగలిగారు. అదే రామ్ చరణ్ (Ram Charan) గొప్పతనం. దానికి తోడు కెరీర్ తారాజువ్వలా వెలిగి, దూసుకుపోతుంటే ఆ రికార్డులు, రివార్డులు జీవితానికి మరింత వన్నె తెస్తాయి. రామ్ చరణ్ (Ram Charan)కి తెచ్చాయి. క్లుప్తంగా, క్షుణ్ణంగా చెప్పాలంటే బంగారానికి తావి అబ్బినట్టు.
-
- చిత్రపరిశ్రమలో పాదం మోపుతూనే ముళ్ళ కిరీటాన్ని ధరించి మరీ వచ్చిన రామ్ చరణ్, చాలా ఒడుపుతో, దీక్షతో కిరీటంలోని ప్రతీ ముల్లునీ పువ్వుగా మార్చుకుని, చిరునవ్వుతో జీవనవలయాలను ఛేదించి ప్రతీ అడుగూ పిడుగై, ప్రతీ మలుపూ గెలుపై ఈ రోజున అంతర్జాతీయంగా సుప్రసిద్ధుడై, గ్లోబర్ స్టార్‌గా విశ్వనక్షత్రమై వెలుగొందే స్థాయికి, స్థితికి అంచెలంచెలుగా చేరుకున్నారు.
-
- పరిశ్రమలోకి, ప్రేక్షకుల ముందుకి వస్తూనే ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకుని, తనంతతానుగా సాటిలేని కమర్షియల్ రేంజ్‌కి చేరుకోవడం నిజంగా అభినందనీయం. మెగాస్టార్ కొడుకుగా ఎన్నాళ్ళు ఆదరిస్తారు....పవన్ కళ్యాణ్ అన్నయ్య కొడుకుగా ఎనాళ్ళు క్రేజ్ ఉంటుంది....అది కేవలం ఒక చిరునామాగా మాత్రమే ఉపయోగం. వాటిని దాటుకుని, తనని తాను నిర్మించుకోవడం, తనని తాను అందుకోవడమే రామ్ చరణ్ ఘనతగా ఒప్పుకోవాలి.
-
- ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో ప్రపంచవేదికపైన రామ్ చరణ్ (Ram Charan) నిలబడితే లోకమంతా కేవలం రామ్ చరణ్‌ని మాత్రమే చూడగలిగింది మెగాస్టార్‌ని కాదు. పవన్ కళ్యాణ్‌ని కానేకాదు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ ఒక్కరికీ దక్కని మహామహా అనుకోని అరుదైన గౌరవాలు, సత్కారాలు రామ్ చరణ్‌కి లభ్యమవుతుంటే హర్షనీయంగా, అభిలషణీయంగా అనిపించాయి తప్పితే ఏ క్షణంలోనూ మరో విధంగా గోచరించలేదు
-
- అదీ జీవితమంటే...అదీ సాధనంటే...అదీ వ్యక్తిత్వం అంటే. ఎలా ఎదగాలి, ఎదిగినా ఎలా ఒదగాలి, ఒదుగుతూ కూడా ఎత్తుగా ఎలా కనిపించాలి వంటి వ్యక్తిత్వ వికాస సూత్రాలను ఎందరో రామ్ నుంచి ఆదర్శంగా తీసుకోవాలి. రామ్ చరణ్ ఈ రోజున హీరోగా ఎంత గొప్పగా ఎదిగారో, వ్యక్తిగా అంత ఆదర్శప్రాయమైన ఔన్నత్యాన్ని ప్రోది చేసుకున్నారు. పేరెన్నికగన్న జాతీయ ఛానెల్స్ రామ్ చరణ్‌ని నెత్తిమీద పెట్టుకున్నాయి. ఓకే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రామ్ చరణ్‌కి ఓ కలికితురాయిగానే నిలుస్తుంది.
-
- దాని గురించి భేదాభిప్రాయమే లేదు. సినిమాని దాటి, తనదైన వ్యక్తిత్వ ముద్రను చాటి చెప్పకోగలిగిన రామ్ చరణ్ (Ram Charan) మానసిక సామర్ధ్యాన్ని ఏ క్షణంలోనూ విస్మరించలేం. అది ఆర్ఆర్ఆర్ (RRR) ఘనవిజయానికే తలమానికం. కలకాలం మన్నే గౌరవానికి కొలమానం. ‘గేమ్ ఛేంజర్’... రామ్ చరణ్ నింజానే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.
-
- ఒక రీతిలో కాదు. వందరీతుల్లో. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపైన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju), గొప్ప రికార్డులను దారంతా నెలకొల్పుకున్న శంకర్ (Shankar) నిర్దేశకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా నిర్మిస్తున్న చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అని టైటిల్ ప్రకటించారు. తెలుగు టైటిల్ కాకపోయినా, ఈ రోజున రామ్ చరణ్ (Ram Charan)కి లభించిన పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ఇమేజ్‌కి ధీటుగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అని టైటిల్ పెట్టడం భలే కిక్‌నిచ్చింది అభిమానులకు. ప్రపంచభాషలన్నిటికీ సరిపోయే టైటిల్. ఆలోచించి ఆలోచించి చాలా అంచనాలతో, గొప్ప తెలివితో ఈ టైటిల్ పెట్టారు. గ్రేట్ టైటిల్

Ehatv
Next Story