చెన్నైలో(Chennai) సందడి చేశారు టాలీవుడ్ మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్. చెన్నైలో స్టార్ డైరెక్టర్ల మధ్య రామ్ చరణ్ తలుక్కున మెరిశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ స్టార్ డైరెక్టర్ దర్శకుడు శంకర్(Director shankar) నిన్న(17 అగస్ట్) 60వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే.

తమిళంలో మహా మహా దర్శకులందరి మధ్య.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) తళుక్కున మెరిశారు. అవును చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్ కు సబంధించి న్యూస్ వైరల్ అవుతోంద.ి

చెన్నైలో(Chennai) సందడి చేశారు టాలీవుడ్ మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్. చెన్నైలో స్టార్ డైరెక్టర్ల మధ్య రామ్ చరణ్ తలుక్కున మెరిశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ స్టార్ డైరెక్టర్ దర్శకుడు శంకర్(Director shankar) నిన్న(17 అగస్ట్) 60వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల నుంచి ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అంతే కాదు ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న గేమ్‌ ఛేంజర్‌‌(Game changer) సెట్‌లో కేక్‌ కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు కూడా చేశారు.

ఇక సెట్ లో సెలబ్రేషన్స్ అనంతరం నిన్న సాయంత్రం తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, దర్శకులకు శంకర్ పార్టీ ఇచ్చారు.చెన్నైలో జరిగిన ఈ పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ వేడుకల్లో హీరో విక్రమ్‌(Vikram), డైరెక్టర్లు లోకేశ్ కనగరాజ్(Lokesh kanaraju), వెట్రిమారన్, విఘ్నేశ్ శివన్(Vignesh shivan), గౌతమ్ వాసుదేవ్‌ మీనన్(Gautham vasudev menon), లింగుస్వామి, ఎస్‌జే సూర్య, కార్తిక్ సుబ్బరాజ్, గోపీచంద్ మలినేని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు సందడి చేశారు.

ఇంతక మంది స్టార్ల మధ్య రామ్ చరణ్ కనిపించడంతో మెగా ప్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషట్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకదాదాపు మూడు నెలలు విరామం తరువాత రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సెట్ లో అడుగు పెట్టాడు. అటు శంకర్ కూడా ఇండియన్2 మూవీ మేజర్ షూటింగ్ కంప్లీట్ చేసి.. గేమ్ ఛేంజర్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈమూవీ దాదాపు 75 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ఇది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కియార్ అద్వానీ హీరోయిన్. దిల్‌ రాజు నిర్మాత.ఈమూవీలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈసినిమాలో అంజలీ, శ్రీకాంత్, జయరాం. సునిల్ లాంటి స్టార్ కాస్ట్ సందడి చేయబోతున్నారు.

Updated On 19 Aug 2023 12:01 AM GMT
Ehatv

Ehatv

Next Story