ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) ఇప్పుడు గ్లోబల్ స్టార్స్.. అవును అది వారు అంతర్జాతీయంగా అందుకుంటున్న గౌరవాలను చూస్తుంటేనే తెలిసిపోతుంది. తాజాగా మరో గౌరవం సాధించారు ఈ టాలీవుడ్ హీరోలు.

ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) ఇప్పుడు గ్లోబల్ స్టార్స్.. అవును అది వారు అంతర్జాతీయంగా అందుకుంటున్న గౌరవాలను చూస్తుంటేనే తెలిసిపోతుంది. తాజాగా మరో గౌరవం సాధించారు ఈ టాలీవుడ్ హీరోలు.

ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు ఎదిగారు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. అంతర్జాతీయ స్థాయిలో వీరి స్టార్‌‌డమ్ అమాంతం పెరిగిపోయింది. ఇద్దరు స్టార్లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాదు.. గ్లోబల్ స్టార్స్ గా వారు ఎన్నో సత్కారాలు కూడా అందుకుంటున్నారు. హాలీవుడ్ దర్శకులు, ఫిల్మ్ మేకర్స్.. వీరి నటనను అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కు అనేక అనేక అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు ఇద్దరిపై ప్రశంసల వర్షం కురింసింది. దాంతో, భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ వీరి ఫ్యాన్‌ బేస్ భారీగా పెరిగింది.

ఇక ముఖ్యంగా ఇండియన్ సినిమాలను బాగా ఆదరించే జపాన్‌లో చరణ్, ఎన్టీఆర్ ల ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. రజనీకాంత్, ప్రభాస్ తరువాత ఆర్ఆర్ఆర్ హీరోలు అక్కడ స్టార్లుగా మారిపోయారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా జపనీస్‌లో ప్రదర్శించినప్పుడు అక్కడి అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. ఇక జపాన్ లో మనహీరోల స్టార్డమ్ వెలిగిపోతోంది. ట్రిపుల్ ఆర్ హీరోలు ట్రెండ్ ను వారు ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు కూడా.

తాజాగా జపాన్‌కు చెందిన ఓ ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్(Life Style Magazine) అనన్ చరణ్, తారక్ ఫొటోలను తమ తాజా ఎడిషన్ కవర్ పేజీపై ముద్రించింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మ్యాగజైన్‌ కవర్ పేజీని షేర్ చేసింది. ఇప్పటిదాకా వివిధ దేశాలకు చెందిన ఇంగ్లిష్ మ్యాగజైన్ల కవర్ పేజీలపై మన దేశ హీరోలు చోటు దక్కించుకోగా.. జపనీస్ మ్యాగజైన్ ముఖచిత్రంగా మారిన ఘనత తారక్, చరణ్ సొంతం అయింది.

ఇక ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్స్ గా మారిన ఈ హీరోలు ప్రస్తుతం వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. చరణ్ శంకర్ తో గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తుండగా.. ఎన్టీఆర్ కూడా కొరటాల శివతో తన 30వ సినిమాను రెడీ చేస్తున్నాడు. చరణ్ నెక్ట్స్ మూవీ బుచ్చిబాబుతో ఫిక్స్ చేయగా.. ఎన్టీఆర్ మాత్రం కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఆతరువాత సినిమాచేయబోతున్నాడు.

Updated On 19 May 2023 12:31 AM GMT
Ehatv

Ehatv

Next Story