డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) తన మొదటి సినిమా ఉప్పెనతో యూత్ ఆడియన్స్‏ను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం సూపర్భ్ బ్లాక్ బస్టర్‏గా నిలిచింది. అయితే ఉప్పెన తర్వాత ఈ డైరెక్టర్ చేయబోయే రెండో ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) తన మొదటి సినిమా ఉప్పెనతో యూత్ ఆడియన్స్‏ను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం సూపర్భ్ బ్లాక్ బస్టర్‏గా నిలిచింది. అయితే ఉప్పెన తర్వాత ఈ డైరెక్టర్ చేయబోయే రెండో ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‏తో సినిమా అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు బుచ్చిబాబు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‏తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి ఈ సినిమాపై ఆడియన్స్‏లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాడు. చరణ్‏ను మాస్ అవతారంలో చూపించాలని ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) నిర్మిస్తున్నారు. చరణ్‏కు ఇది 16వ సినిమా కాగా.. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా తర్వాత షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.

కాగా రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు సందర్భంగా ఆర్సీ 16 ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేశారు. బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ట్విటర్ ద్వారా చెర్రీకి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ పోస్టర్‏లో డార్క్ బ్యాక్ డ్రాప్‏లో చరణ‏ను బ్యూటిఫుల్ స్కెచ్‏ను చూపించారు. రామ్ చరణ్‏పై తనకున్న అభిమానాన్ని ఆర్సీ 16లో చూపిస్తానని, ఇది అభిమానులకు నచ్చుతుందని డైరెక్టర్ ఓ కార్యక్రమంలో చెప్పాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‏లో సాగే కల్పిత కథగా ఉంటుందని ఆర్సీ 16 చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‏ను హీరోయిన్‏గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెరక్టర్‏గా ఏఆర్ రెహమాన్‏ను తీసుకోవాలని చూస్తున్నారు. అయితే మెయిన్ కాస్ట్ అండ్ టెక్నీషియన్స్ గురించి అఫిషియల్ అనౌన్స్‏మెంట్ రావాల్సి ఉంది.

Updated On 24 May 2023 11:23 PM GMT
Ehatv

Ehatv

Next Story