హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet singh) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో(Jackie Bhagna) కలిసి ఈ నెల 21వ తేదీన ఏడు అడుగులు నడవనున్నాను. ఇప్పటికే వీరి ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. గురువారం రాత్రి ప్రీ వెడ్డింగ్ వేడుకలను(Pre wedding celebrations) నిర్వహించారు. భగ్నానీ ఇంట్లో జరిగిన ఈ ఫంక్షన్‌కు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ రకుల్ ప్రీత్ సింగ్ మూడేళ్ల కిందటే ప్రకటించారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet singh) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో(Jackie Bhagna) కలిసి ఈ నెల 21వ తేదీన ఏడు అడుగులు నడవనున్నాను. ఇప్పటికే వీరి ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. గురువారం రాత్రి ప్రీ వెడ్డింగ్ వేడుకలను(Pre wedding celebrations) నిర్వహించారు. భగ్నానీ ఇంట్లో జరిగిన ఈ ఫంక్షన్‌కు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ రకుల్ ప్రీత్ సింగ్ మూడేళ్ల కిందటే ప్రకటించారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఫిబ్రవరి 21వ తేదీన ఒక్కటి కాబోతున్నారు. గోవాలోని(Goa) ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం హిందీలో మేరీ పత్నీ కా సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తమిళంలో తెరకెక్కుతున్న ఇండియన్ -2(Indian-2) సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. రకుల్ తెలుగులో చివరగా 2021లో వచ్చిన కొండపొలంలో నటించింది.