✕
Rakul Preet Singh : వన్ షోల్డర్ గౌనులో దర్శనమిచ్చిన రకుల్.. టెంప్ట్ చేస్తున్నావంటున్న ఫ్యాన్స్.. !
By EhatvPublished on 27 May 2023 9:58 PM GMT
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బోల్డ్ డ్రెస్‌లతో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ భామ రన్నింగ్‌లో ఉన్న మీటర్లా ఎప్పుడూ అభిమానుల కోసం హీట్‌ను ఆన్‌లోనే ఉంచుతుంది.

x
Rakul Preet Singh
-
- రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బోల్డ్ డ్రెస్‌లతో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ భామ రన్నింగ్‌లో ఉన్న మీటర్లా ఎప్పుడూ అభిమానుల కోసం హీట్‌ను ఆన్‌లోనే ఉంచుతుంది. ఆమె సొగసైన అందం చూసి అభిమానులు నోరెళ్లబెట్టేలా చేస్తుంది.
-
- అయితే తాజాగా అబుదాబీలో జరిగిన IIFA Rocks 2023లో మెరిసింది ఈ బ్యూటీ. గ్రీన్ కార్పెట్‌పై స్టన్నింగ్ లుక్స్ ఇచ్చింది ఈ భామ. వైట్ గౌనులో అక్కడ ఉన్నవాళ్లందరినీ ఆకర్షించింది రకుల్ ప్రీత్ సింగ్.
-
- రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ భామ ఒకప్పుడు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది. నెంబర్ వన్ హీరోయిన్లందరినీ పక్కకినెట్టేసి తన హవా సాగించింది. ఇండస్ట్రీకి కొత్త తరం అమ్మాయిలు రావడంతో ఈ భామకు కాస్త ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. అప్పటికీ అడపాదడపా చిత్రాలు చేస్తూ నెట్టుకొచ్చింది.
-
- కొత్త హీరోయిన్లకు ఇటు ప్రొడ్యూసర్లు(Producers), అటు ఆడియన్స్ అలవాటు పడటంతో ఆమె ఫేడ్ అవుట్ అయింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు చాలా అంటే చాలా వరకు తగ్గిపోవడంతో బాలీవుడ్లో జెండా పాతింది ఈ పంజాబీ బ్యూటీ.
-
- కొంతకాలంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ బ్యూటీ.. ఫర్ఫామెన్స్ బేస్డ్ క్యారెక్టర్లకు ఇంపార్టెన్సీ ఇస్తోంది. రకుల్ ప్రస్తుతం విజయ్ దర్శకత్వం వస్తున్న హారర్ డ్రామా ‘భూ’ (Boo) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో మోనికా, నివేదా పెతురాజ్, విద్యురామన్, మేఘా ఆకాష్, మంజిమా మోహన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
-
- తన టాలెంట్, ఫ్యాషన్ సెన్స్, డిఫరెంట్ క్యారరెక్టర్స్ ఎంపిక చేసుకుంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికీ ఎంటర్టైన్మెంట్ రంగంలో రాణిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే తన ప్రియుడు జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని ఈ బ్యూటీ వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
-
- ప్రెజెంట్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఎక్కువ సినిమాలు చేయడమే టార్గెట్ పెట్టుకుందట. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాలు ఆరబోస్తోంది. ఈ భామ అప్లోడ్ చేసే ఫొటోలకు లక్షల్లో లైక్స్ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో 23.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story