వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్‌ ప్రీత్‌సింగ్‌(Rakul Preet Singh) అచిర కాలంలోనే టాప్‌స్టార్ల సరసన నటించే స్థాయికి ఎదిగారు. పదేళ్లుగా ఆ పంజాబీ భామ హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తున్నారు. తెలుగులో ఆమెకు మంచి క్రేజ్‌ ఉంది. తెలుగులోనే కాదు అటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లోను నటించి మెప్పించారు. ఈ ఏడాదిలో విడుదలైన ఛత్రివాలి, భూ, ఐ లవ్‌ యూ లాంటి సినిమాలో భిన్నమైన పాత్రలు పోషించి సినిమా పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకున్నారు

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్‌ ప్రీత్‌సింగ్‌(Rakul Preet Singh) అచిర కాలంలోనే టాప్‌స్టార్ల సరసన నటించే స్థాయికి ఎదిగారు. పదేళ్లుగా ఆ పంజాబీ భామ హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తున్నారు. తెలుగులో ఆమెకు మంచి క్రేజ్‌ ఉంది. తెలుగులోనే కాదు అటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లోను నటించి మెప్పించారు. ఈ ఏడాదిలో విడుదలైన ఛత్రివాలి, భూ, ఐ లవ్‌ యూ లాంటి సినిమాలో భిన్నమైన పాత్రలు పోషించి సినిమా పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకున్నారు. నటిగా ముందుకు సాగుతూ పాన్‌ ఇండియా రీచ్‌లో అభిమానులను సొంతం చేసుకున్నారు. ' ఓ నటిగా నా జీవితంలో ఇది ఉత్తేజకరమైన స్టేజ్‌. అన్ని భాషలలో సినిమాలు చేసే అవకాశం దొరకడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశాలు వస్తున్నందుకు కొంచెం గర్వంగా కూడా ఉంది. సరిహద్దులు దాటుతూ భాషతో సంబంధం లేకుండా కథతో ప్రేక్షకులతో మాట్లాడే అవకాశం సినిమాల వల్ల రావడం చాలా సంతోషం' అని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అన్నారు.
తన రాబోయే చిత్రాలన్నీ వివిధ భాషల్లో ఉంటాయని తెలిపారు. మేరి పత్ని కా రీమేక్‌(Meri Patni Ka Remake), భారతీయుడు 2(Indian-2), అలయాన్‌ వంటి సినిమాలు కొన్ని చిత్రీకరణలో ఉండగా మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. అభిమానులు ఆ సినిమాలు చూస్తూ ఎలా అనుభూతి చెందుతారో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉందన్నారు ఎప్పటిలాగే నాపై ప్రేమను చూపుతూనే ఉంటారని ఆశిస్తున్నానని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తెలిపారు.

Updated On 8 Sep 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story