పెళ్లయిన(Marriage) కొత్త జంటలు హనీమూన్‌కు(Honey moon) వెళ్లడం పరిపాటి! కానీ సెలబ్రిటీల సంగతి అలా కాదు. వాళ్లకు టైమ్ దొరకదు. ముఖ్యంగా సినిమా వాళ్లకైతే మరీనూ! అప్పటికే కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయాలికదా! ఈ కష్టం ఎక్కువగా హీరోయిన్లకే వస్తుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్‌కు(Rakulpreet Singh) కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. ఫిబ్రవరిలో జాకీ భగ్నానీతో(Jockey bhagnani) రకుల్ పెళ్లయింది.

Rakul Preet Singh
పెళ్లయిన(Marriage) కొత్త జంటలు హనీమూన్‌కు(Honey moon) వెళ్లడం పరిపాటి! కానీ సెలబ్రిటీల సంగతి అలా కాదు. వాళ్లకు టైమ్ దొరకదు. ముఖ్యంగా సినిమా వాళ్లకైతే మరీనూ! అప్పటికే కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయాలికదా! ఈ కష్టం ఎక్కువగా హీరోయిన్లకే వస్తుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్‌కు(Rakulpreet Singh) కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. ఫిబ్రవరిలో జాకీ భగ్నానీతో(Jackky bhagnani) రకుల్ పెళ్లయింది. అప్పట్నుంచి హనీమూన్‌కు ప్లాన్ చేస్తూనే ఉన్నారు కొత్త దంపతులు. కానీ టైమ్ సెట్ అవ్వడం లేదు. ఇన్నాళ్లకు ఇద్దరికీ కాసింత తీరుబాటు దొరికింది. పెళ్లయిన నాలుగు నెలల తర్వాత హనీమూన్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. కొకొమో ఐలాండ్స్‌లో(Kokomo Islands) రకుల్, జాకీలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫిజీ దేశంలోని ఓ ప్రైవేట్ ద్వీపమిది! ఈ చిన్న ద్వీపంలో కొత్త జంటకు సమయమే తెలియడం లేదు. జాకీ తీసిన తన ఫోటోలను రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న రకుల్ ప్రీత్‌సిం్, జాకీ భగ్నానీలు ఈ ఏడాది ఫ్రిబవరిలో గోవాలో పెళ్లి చేసుకున్నారు. కరోనా సమయంలో ప్రేమ విషయాన్ని తొలిసారిగా చెప్పింది రకుల్. పెళ్లి నాటికే రకుల్ రెండు సినిమాలు చేస్తోంది. జాకీ కూడా నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇంత కాలానికి కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయ్యాయి. హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత రకుల్ భారతీయుడు-2 ప్రమోషన్లలో పాల్గొంటుంది.
