బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌(Rakhi Sawanth) అంటే తెలియనివారు చాలా తక్కువ మంది ఉంటారంతే. సోషల్‌ మీడియాలో(Social Media) యాక్టివ్‌గా ఉన్నవారికి ఆమె గురించి ఇంట్రడక్షన్‌ అనవసరం. ఎందుకంటే విచిత్రమైన రీల్స్‌ చేస్తూ సందడి చేస్తుంటారామె! వ్యక్తిగత జీవితంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కొన్ని సంఘటనలను ఆమె మర్చిపోలేకపోతున్నారు. తీవ్రమైన ఒత్తడికి లోనైన రాఖీ సావంత్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. భర్త అదిల్‌ఖాన్‌ దురానీతో(Adil Khan Durani) విడాకులు, అటు తర్వాత అమ్మ మరణంతో తీవ్రమైన మనో వేదనను అనుభవించారు.

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌(Rakhi Sawanth) అంటే తెలియనివారు చాలా తక్కువ మంది ఉంటారంతే. సోషల్‌ మీడియాలో(Social Media) యాక్టివ్‌గా ఉన్నవారికి ఆమె గురించి ఇంట్రడక్షన్‌ అనవసరం. ఎందుకంటే విచిత్రమైన రీల్స్‌ చేస్తూ సందడి చేస్తుంటారామె! వ్యక్తిగత జీవితంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కొన్ని సంఘటనలను ఆమె మర్చిపోలేకపోతున్నారు. తీవ్రమైన ఒత్తడికి లోనైన రాఖీ సావంత్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. భర్త అదిల్‌ఖాన్‌ దురానీతో(Adil Khan Durani) విడాకులు, అటు తర్వాత అమ్మ మరణంతో తీవ్రమైన మనో వేదనను అనుభవించారు. తన మాజీ భర్త ఆదిల్‌పై కేసు పెట్టడంతో ఆయన రిమాండ్‌కు వెళ్లి వచ్చారు. లేటెస్ట్‌గా రాఖీ సావంత్‌ గురించి ఆదిల్‌ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అన్యాయంగా అత్యాచారం(Molestation) కేసు పెట్టారని అంటున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక మొదటిసారి ఆదిల్‌ మీడియాతో ముచ్చటించారు. తన మాజీ భార్య రాఖీ సావంత్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆమె చాలా ప్రమాదకరమైన మహిళ అంటూ వ్యాఖ్యానించారు. రాఖీ సావంత్‌కు పెళ్లైన విషయాన్ని దాచి పెట్టి తనను మోసం(Cheat) చేసిందని ఆరోపించారు.

రితేష్‌(rithesh) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులు(Divorce) తీసుకోలేదని అన్నారు. ఆమె గురించి ఇంకా చాలా చెప్పుకొచ్చారు ఆదిల్‌. 'ఆమెతో మాట్లాడటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే మహిళలు ఏమైనా చేయగలరు. రేప్‌ అని అరిచినా మనల్ని అరెస్ట్‌ చేసే విధంగా మన రాజ్యాంగం మహిళలకు రక్షణ కల్పిస్తోంది. అంతే కాకుండా రితేష్‌తో కలిసి రాఖీ నన్ను మోసం చేసింది. అతనితో పెళ్లైన విషయాన్ని దాచిపెట్టింది. విడాకులు తీసుకోకుండానే నాతో రిలేషన్ కొనసాగించింది. నాతో ఉంటూనే రితేష్‌తో బంధాన్ని కొనసాగించింది. యూకే వర్క్‌ టూర్‌ గురించి రహస్యంగా రితేష్‌కు రాఖీ సందేశాలు పంపింది' అంటూ ఆదిల్‌ ఆమెపై విమర్శలు చేశారు. అంతే కాకుండా శారీరకంగా తనను హింసించిందన్నారు. అతని శరీరంపై గాయాలను చూపిస్తూ ఒక వీడియోను చూపించారు. ఆమెను తాను వేధించినట్లు చెప్పిందంతా అబద్ధమని తెలిపారు. వయసులో ఆమె కంటే చిన్నవాడిని అయినప్పటికీ దుబాయ్‌లో ఆమె కోసం 2.8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. దుబాయ్‌లో ఓ ఫ్లాట్, బీఎండబ్లూ కారు, నగలతో పాటు ఖరీదైన బహుమతులు కొనిచ్చానన్నారు అంతే కాకుండా రాఖీ నాకు తెలియకుండానే అకౌంట్‌ నుంచి 1.5 కోట్ల రూపాయలు విత్‌డ్రా చేసిందని ఆరోపించారు.

తనపై తప్పుడు ఆరోపణలతో అత్యాచారం కేసులో పెట్టిందని, ఆమె వల్ల నా జీవితం గందరగోళంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాఖీకి వ్యతిరేకంగా నటి షెర్లిన్ చోప్రా(Sherlyn Chopra) చేసిన కామెంట్స్‌ నిజమేనన్నారు. ఆమె వలలోకి మరొక వ్యక్తి బలి కాకుండా ఉండాలనేదే తన తపన అని ఆదిల్‌ అన్నారు. రాఖీ సావంత్ తనకు డ్రగ్స్ అలవాటు చేసి, న్యూడ్ వీడియో తీసిందని ఆదిల్ ఆరోపించాడు. అంతే కాకుండా తన తల్లికి క్యాన్సర్ పేరుతో ప్రజలను దోచుకుందన్నారు. తల్లికి ఆరోగ్యం బాలేదని ప్రతి నెలా ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల వరకు విరాళాలు సేకరించేదని ఆదిల్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆదిల్ చేసిన కామెంట్స్ బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Updated On 22 Aug 2023 12:34 AM GMT
Ehatv

Ehatv

Next Story