నటి రాఖీ సావంత్(Rakhi Savanth) అంటే తెలియనివారు ఉండరు. ఒకప్పుడు ఆమె సెన్సేషన్. బిగ్‌బాస్(Bigg Boss) షోతో రాఖీ సావంత్ విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు. షో అయ్యాక కూడా ఆమె ఆ పాపులారిటీని కాపాడుకుంటూ వస్తున్నారు. తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారుతున్నారు. ఈ మధ్యనే తన భర్తకు విడాకులు(divorce) ఇచ్చేసిన ఆమె ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని రాఖీ సావంతే స్వయంగా చెప్పారు.
నటి రాఖీ సావంత్(Rakhi Sawanth) అంటే తెలియనివారు ఉండరు. ఒకప్పుడు ఆమె సెన్సేషన్. బిగ్‌బాస్(Bigg Boss) షోతో రాఖీ సావంత్ విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు. షో అయ్యాక కూడా ఆమె ఆ పాపులారిటీని కాపాడుకుంటూ వస్తున్నారు. తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారుతున్నారు. ఈ మధ్యనే తన భర్తకు విడాకులు(divorce) ఇచ్చేసిన ఆమె ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని రాఖీ సావంతే స్వయంగా చెప్పారు. తనకు ఒకరు పరిచయం అయ్యారని, అతడు చాలా మంచి వ్యక్తి అని, కానీ అతడితో జీవితాన్ని పంచుకోవడానికి ఇప్పుడప్పుడే సిద్ధంగా లేనని రాఖీ సావంత్ చెప్పుకొచ్చారు.
' నా మొదటి పెళ్లిని జీవితంలో మర్చిపోలేను. ఆ పెళ్లితో నేను అనేక ఇబ్బందులు పడ్డాను. అనేక కష్టాలు పడ్డాను. అవన్నీ మీకు తెలుసు. అందుకే పెళ్లంటేనే భయం వేస్తోంది. ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి దుబాయ్ వెళ్లి వచ్చాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. జీవితంలో మనల్ని బాధపెట్టేవాళ్లు ఉంటారు. గాయాలను సలిపేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఆ గాయాలకు ఆయింట్‌మెంట్ రాసేవారు కొందరే ఉంటారు.
వారిని వదిలిపెట్టకుండా మనతోనే ఉంచేసుకుంటే మనకే మంచిది' అని రాఖీ సావంత్(Rakhi sawanth) అన్నారు. చాన్నాళ్ల కిందట రితేశ్ సింగ్(Rithesh Singh) అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు రాఖీ సావంత్. అయితే అతడు తనకు ఇదివరకే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టాడు. పైగా మొదటి భార్యకు అతడు విడాకులు కూడా ఇవ్వలేదు. రితేశ్ సింగ్‌కు భార్యా పిల్లలు ఉన్నారని, అంచేత అతడితో తన పెళ్లి చెల్లదంటూ తెగదెంపులు చేసుకున్నారు రాఖీ సావంత్.
లాస్టియర్ ప్రేమికుల రోజున భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన ఆదిల్ దురానీ(Aadhil Dhurani) ప్రేమలో పడ్డారు. ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆదిల్‌ను పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆలస్యంగా బయటకు చెప్పారు రాఖీ. ఇది జరిగిన కొంత కాలానికే వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి ఎంత వరకు వెళ్లాయంటే భర్తను రాఖీ జైల్లో పెట్టించేంతగా! అదిల్‌తో తెగదెంపులు చేసుకున్నారు కానీ ఇంకా విడాకులు మంజూరు కాలేదు.