ప్రముఖ టెలివిజన్‌ నటి(TV Actress) రాజశ్రీ ఠాకూర్‌(Rajasri Thakur) తెలుసుగా...! సాత్‌ ఫేరే(Sath Phere): సలోని కా సఫర్‌(Saloni Ka Safar) సీరియల్‌తో నేమ్‌ను ఫేమ్‌ను తెచ్చుకున్నారామె! మోడలింగ్‌పై ఆసక్తితో గ్లామర్‌ ఫీల్డ్‌లో అడుగుపెట్టారు రాజశ్రీ ఠాకూర్‌. ఆ అందాల భామ ఇప్పుడు కెరీర్‌కు సబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

ప్రముఖ టెలివిజన్‌ నటి(TV Actress) రాజశ్రీ ఠాకూర్‌(Rajasri Thakur) తెలుసుగా...! సాత్‌ ఫేరే(Sath Phere): సలోని కా సఫర్‌(Saloni Ka Saphar) సీరియల్‌తో నేమ్‌ను ఫేమ్‌ను తెచ్చుకున్నారామె! మోడలింగ్‌పై ఆసక్తితో గ్లామర్‌ ఫీల్డ్‌లో అడుగుపెట్టారు రాజశ్రీ ఠాకూర్‌. ఆ అందాల భామ ఇప్పుడు కెరీర్‌కు సబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన బాలీవుడ్‌ భామ కాస్టింగ్‌ కౌచ్‌(Casting Cauch) గురించి నోరు విప్పారు. ఇండస్ట్రీలో ప్రారంభ రోజుల్లో క్యాస్టింగ్‌ కౌచ్‌కు గురయ్యానని తెలిపారు. బాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ భయంకరంగా ఉందని, దానికి చాలా మంది బలయ్యారని రాజశ్రీ తెలిపారు. 'నాకు మోడలింగ్‌పై(Modeling) చాలా ఆసక్తి ఉండేది. అందుకే టీవీ ప్రకటనలు, ప్రెస్‌ షూట్‌లు చేసేదానిని.

మనల్ని ట్రాప్‌ చేయడానికి ప్రయత్నించే కొంతమందిని అప్పుడు నేను చూశాను. అప్పుడు నాది చాలా చిన్న వయసు. ఎదుటివారి ఉద్దేశాలు ఏమిటో గుర్తించలేకపోయాను. వాటి నుంచి అప్రమత్తంగా ఉంటే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఈ వృత్తిలో చాల అలర్ట్‌గా ఉండాలి. అసలు ఈ రోజుల్లో ఏ వృత్తిలోనైనా మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో పోటీ చాలా ఎక్కువ. ఒకరినొకరు తొక్కేసేందుకే ప్రయత్నిస్తున్నారు' అని రాజశ్రీ ఠాకూర్‌ తెలిపారు. రాజశ్రీ టీవీ సీరియల్స్‌(TV Serials) చేయకమునుపు ఆల్‌ ఇండియా రేడియోలో(All India Radio) మరాఠీ న్యూస్‌ రీడర్‌గా(News Reader) పని చేశారు. చిన్న చిన్న అడ్వర్‌టైస్‌మెంట్లను కూడా చేశారు. సప్నా బాబుల్‌కా బిదాయి, అల్గే జనమ్‌ మోహే బితియా హి కిజో, భారత్‌ కా వీర్‌పుత్ర-మహారాణా ప్రతాప్‌, షాదీ ముబారక్‌, అప్నాపన్‌- బదల్తే రిష్టన్‌ కా బంధన్‌ వంటి చాలా షోలలో నటించారు.

Updated On 14 July 2023 5:10 AM GMT
Ehatv

Ehatv

Next Story