గత కొంత కాలంగా సుమ, రాజీవ్ కనకాల విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో.. ఈ రూమర్స్ విషయంలో స్పందించారు ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల. ముఖ్యంగా రాజీవ్ సుమ విడాకుల విషయంపై క్లారిటీ కూడా ఇచ్చాడు.
సుమ(Suma) తో విడాకులంటూ(divorce) వస్తున్న వార్తలపై స్పందించాడు ఆమె భర్త ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల(Rajiv kanakala). ఈ వార్తల వల్ల తమ పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారంటున్నాడు రాజీవ్.
గత కొంత కాలంగా సుమ, రాజీవ్ కనకాల విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో.. ఈ రూమర్స్ విషయంలో స్పందించారు ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల. ముఖ్యంగా రాజీవ్ సుమ విడాకుల విషయంపై క్లారిటీ కూడా ఇచ్చాడు.
టాలీవుడ్ లో స్టార్ యాంకర్(Star Anchor) గా వెలుగు వెలుగుతోంది సుమ. స్టార్ హీరోలకు సబంధించిన సినిమా ఈవెంట్లు ఉంటే సుమ చేయాల్సిందే. బుల్లితెరపై భారీ ఇమేజ్ తో దూసుకుపోతు.. హోస్టింగ్ లో ఎవరికీ అందనంత ఇమేజ్ ను సాధించింది సుమ. కేరళ అమ్మాయి అయినా.. తెలుగు అద్భుతంగా మాట్లాడుతూ.. మనలోకలిసిపోయింది. అంతే కాదు.. నటిగా ఎంట్రీ ఇచ్చి... నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లాడింది సుమ. రాజీవ్ కు సరైనా అవకాశాలు లేక అడపాదడపాసినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. సుమ మాత్రం స్టార్ డమ్ తో దూసుకుపోయింది.
అయితే గత కొంత కాలంగా సుమ - రాజీవ్ కనకాల ఇద్దరికి పడటంలేదని.. వారి మధ్య మనస్పర్థలు వచ్చాయనీ, ఇద్దరూ కూడా త్వరలో విడిపోయి.. విడాకులు తీసకోబోతున్నారంటూ వార్తలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంలో సుమ చాలా సార్లు క్లారిటీ ఇచ్చేప్రయత్నం చేసింది.. అవన్నీ పుకార్లంటే స్పెషల్ గా చెప్పింది. అయినా కూడార వార్తలు ఆగలేదు. ఇంకా ఎక్కువయ్యాయి. దాంతో తాజాగా రాజీవ్ కనకాల ఈ విషయంలో స్పందించారు.
తాజాగా ఒ మీడియా సంస్థకు ఇంటర్వయూ(Interview) ఇచ్చిన రాజీవ్ కనకాలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సుమ - నేను విడాకులు తీసుకోనున్నామనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. అలాంటిదేమీ లేదని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ఇదే టాక్ మా అమ్మానాన్నలు ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ బాధ ఉండేదేమో అన్నారు. సుమ ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోదు. కాని తాను మాత్రం . అంత తేలికగా నేను తీసుకోలేను అన్నారు. ఈ విషయంలో తమ పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారని.. స్కూల్లో వాళ్లను ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెపుతారంటూ రాజీవ్ ప్రశ్నించారు.
అంతే కాదు నేను .. సుమ విడిపోలేదు. కలిసే ఉన్నామని చెప్పడం కోసం, తన షోస్ కి నేను వెళ్లాను .. తన ఈవెంట్స్ కి వెళ్లాను. ఇటీవల యూఎస్ వెళ్లినప్పుడు రీల్స్ కూడా చేశాము. ఆ రీల్ బాగా వైరల్ అయింది కూడా. ఇలా మేము కలిసే ఉన్నాం బాబోయ్ అని చెప్పుకోవడం మాకు కష్టమైపోతోంది" అని అన్నాడు. ప్రస్తుతం రాజీవ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.