సూపర్ స్టార్ రజనీకాంత్ లక్నోలో పర్యటనలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం లక్నో చేరుకున్న రజనీకాంత్ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఈ భేటీలో రజనీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు.
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) లక్నో(Lucknow)లో పర్యటనలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం లక్నో చేరుకున్న రజనీకాంత్ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath)ను కలిశారు. ఈ భేటీలో రజనీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. యోగి ఆదిత్యనాథ్‌ను సాధువుగా భావించి ఆయన పాదాలను తాకారు. అయితే యోగి కాస్తా ఇబ్బందిగా కనపడటం చూడొచ్చు. సీఎం యోగి కంటే రజనీకాంత్ వయసులో చాలా పెద్ద. రజనీకాంత్‌కు 72 ఏళ్లు కాగా.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు 51 సంవత్సరాలు. సీఎం పాదాలను తాకడానికి కారణం.. ఆయన సాధువు కావడమేనని భావిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రజనీకాంత్ సంస్కారాన్ని.. సీఎం సాధువుగా ముడిపెట్టి ప్రజలు దీనిని చూస్తున్నారు. అలాగే.. రజనీని మెచ్చుకుంటూ యూజర్లు ట్వీట్ చేశారు. ఒకే సంస్కృతిని నమ్మే హీరోగా రజనీకాంత్‌ను అభివర్ణించారు.
తొలిరోజు గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌తో రజనీకాంత్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రజనీకాంత్ సినిమా జైలర్ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం లక్నోలో తమిళం, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ విడుదలైంది. ఈ భేటీలో రజనీకాంత్, యోగి ఆదిత్యనాథ్ మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి.