రీసెంట్గా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో కలిసి నటించనున్నట్టు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) అనౌన్స్మెంట్ ఇచ్చారు. వీరిద్దరూ చాలా ఏళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే 2017లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి (Gautamiputra Satakarni)లో కేమియో రోల్ మాత్రమే కనిపించారు ఆయన.

Balakrishna-Shiva Rajkumar Project
రీసెంట్గా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో కలిసి నటించనున్నట్టు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) అనౌన్స్మెంట్ ఇచ్చారు. వీరిద్దరూ చాలా ఏళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే 2017లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి (Gautamiputra Satakarni)లో కేమియో రోల్ మాత్రమే కనిపించారు ఆయన. శివన్న గ్రాండ్‌గా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ కాంబినేషన్ మామూలుగా ఉండదని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం రెండు భాగాలు రూపొందే ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా భాగం అవనున్నారట. మొదటి భాగంలో శివరాజ్ కుమార్, రెండవ భాగంలో నందమూరి బాలకృష్ణ జైలర్ పాత్ర పోషించనున్నారు. బాలయ్య బాబు, రజినీకాంత్ హీరోలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెండో భాగం షూటింగ్ జరుగుతోందట.
శివన్న- బాలకృష్ణ, రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న రెండు భాగాల ఈ ప్రాజెక్టు కోసం సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కన్నడ డైరెక్టర్‌ను తీసుకోవాలని చూస్తున్నారట. ఇందులో డైరెక్టర్ హర్ష (Harsha)ను కన్ఫఫార్మ్ చేశారని.. ఇప్పటి వరకు అధికారంగా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ఇక ఈ డైరెక్టర్‌తో శివరాజ్‌కుమార్ గతంలో కలిసి పనిచేశారు. వీరిద్దరూ భజరంగి, వజ్రకాయ, భజరంగి 2 సినిమాలను చేశారు.
కాగా ఈ ప్రాజెక్ట్‌ను శివ రాజ్‌కుమార్ సొంత బ్యానర్ అయిన గీతా పిక్చర్స్‌పై నిర్మించబోతున్నారట. అయితే శివన్న భార్య గీతా శివ రాజ్‌కుమార్ డిసెంబర్ 2022లో నిర్మాతగా మారారు.ముఫ్తీ ఫేమ్ నర్తన్ (Narthan) దర్శకత్వంలో వస్తున్న భైరతి రణగల్ చిత్రం గీతా పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కనుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులపై అభిమానులు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఈ అనౌన్స్మెంట్లు ఎప్పుడు వస్తాయో చూడాలి మరి.
