సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer) బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. సినిమా సక్సెస్కు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కారణమని కొందరంటారు. లేదు రజనీ ఉన్నారు కాబట్టి విజయవంతమయ్యిందని ఆయన ఫ్యాన్స్ అంటారు. కానీ సినిమా ఘన విజయానికి కారణమేమిటో రజనీకాంతే స్వయంగా వెల్లడించారు. నేపథ్య సంగీతమే(Background music) సినిమా సక్సెస్‌కు కారణమన్నారాయన. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ స్థాయిలో లేకపోయి ఉంటే సినిమా అబౌ యావరేజ్‌గా ఉండేదని రజనీ చెప్పారు. జైలర్‌ను ఓ స్థాయిలో నిలబెట్టాడంటూ సంగీత దర్శకుడు అనిరుధ్‌ను(Anirudh Ravichander) పొగిడారు.

Rajinikanth Speech At Jailer Success Meet
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer) బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. సినిమా సక్సెస్కు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కారణమని కొందరంటారు. లేదు రజనీ ఉన్నారు కాబట్టి విజయవంతమయ్యిందని ఆయన ఫ్యాన్స్ అంటారు. కానీ సినిమా ఘన విజయానికి కారణమేమిటో రజనీకాంతే స్వయంగా వెల్లడించారు. నేపథ్య సంగీతమే(Background music) సినిమా సక్సెస్‌కు కారణమన్నారాయన. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ స్థాయిలో లేకపోయి ఉంటే సినిమా అబౌ యావరేజ్‌గా ఉండేదని రజనీ చెప్పారు. జైలర్‌ను ఓ స్థాయిలో నిలబెట్టాడంటూ సంగీత దర్శకుడు అనిరుధ్‌ను(Anirudh Ravichander) పొగిడారు. తనకు, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు(Nelson Dilip Kumar) సూపర్ హిట్ అందించాలనే ఉద్దేశంతో అనిరుధ్ పనిచేశాడని తెలిపారు.మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి సూపర్‌స్టార్లను గెస్ట్ రోల్స్‌లో చూపించడంలో దర్శకుడు నెల్సన్ ఎగ్జాంపుల్‌గా నిలిచారని చెప్పారు. జైలర్ రిలీజ్ తర్వాత అయిదు రోజులు ఆనందంగా ఉన్నానని, ఆ తర్వాత ఇంతకు మించి మరో సినిమా ఎలా ఇవ్వాలనే టెన్షన్ పట్టుకుందని రజనీ తెలిపారు. జైలర్ సక్సెస్ మీట్‌లో రజనీకాంత్ ఈ విషయాలు పంచుకున్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన జైలర్ ఆగస్టు 10న విడుదలై బాక్సాఫీసు దగ్గర 600 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా రజనీకాంత్, నెల్సన్, అనిరుధ్‌లకు నిర్మాత కళానిధి మారన్ విలువైన కార్లను కానుకగా ఇచ్చారు. వాటితోపాటు సినిమా లాభాల్లోంచి వచ్చిన కొంత మొత్తాన్ని ఈ ముగ్గురికి అందించారు. సినిమాకి పనిచేసిన సుమారు మూడు వందల మందికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు. జైలర్ తర్వాత తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందుతోన్న లాల్ సలాం చిత్రంలో రజనీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో రజనీకాంత్ ఓ చిత్రం చేయనున్నారు.
