ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్యా రజినీకాంత్ మళ్లీ ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతుంది. ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో తలైవా రజినీకాంత్ స్పెషల్ కెమియో రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ రోజు ‘లాల్ సలాం’ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభం అయినట్టు మూవీ యూనిట్ అఫిషియల్‏గా అనౌన్స్ చేసింది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‏డ్రాప్‏లో తెరకెక్కుతోంది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్‏ను […]

ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్యా రజినీకాంత్ మళ్లీ ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతుంది. ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో తలైవా రజినీకాంత్ స్పెషల్ కెమియో రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ రోజు ‘లాల్ సలాం’ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభం అయినట్టు మూవీ యూనిట్ అఫిషియల్‏గా అనౌన్స్ చేసింది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‏డ్రాప్‏లో తెరకెక్కుతోంది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్‏ను మేకర్స్ విడుదల చేశారు.

లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‏తో ఈ మూవీని నిర్మిస్తుండగా, సుభాస్కరణ్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రజినీకాంత్ సోదరిగా జీవితా రాజశేఖర్ నటిస్తోంది. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రస్తుతం రాజినీకాంత్ డాక్టర్, బీస్ట్ సినిమాల డైరెక్ట్ నెల్సన్‏తో ‘జైలర్’ మూవీ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ షూటింగ్ పూర్తి చేసుకుని ‘లాల్ సలాం’ సెట్స్‏లో జాయిన్ కానున్నారు తలైవా రజినీకాంత్.

Updated On 7 March 2023 7:23 AM GMT
Ehatv

Ehatv

Next Story