సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailler) సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఆగస్టు 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. తెలుగులో పెద్దగా బజ్ రాలేదు కానీ రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ తర్వాత కొంచెం అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో రజనీకాంత్ గెటప్, ఆయన స్టయిల్, స్వాగ్‌లకు అభిమానులు ఫిదా అయ్యారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailler) సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఆగస్టు 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. తెలుగులో పెద్దగా బజ్ రాలేదు కానీ రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ తర్వాత కొంచెం అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో రజనీకాంత్ గెటప్, ఆయన స్టయిల్, స్వాగ్‌లకు అభిమానులు ఫిదా అయ్యారు. గత కొంత కాలంగా రజనీకాంత్‌కు సరైన హిట్ రాలేదు. అందుకే జైలర్ విజయవంతం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే జైలర్ సినిమా ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అనే టాక్ వినిపిస్తోంది. కాపీ అవునో కాదో తెలియదు కానీ ఇప్పటికే టైటిల్ విషయంలో పెద్ద వివాదమే నడిచింది.
జైలర్ టైటిల్ తమదని మలయాళ దర్శకుడు సక్కిర్ మడతిల్(Sakkir Madathil) న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మార్కెట్ పరంగా తమ చిత్రానికి నష్టం రాకూడదని సన్ పిక్చర్స్(Sun Pctures) సంస్థ కూడా కోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉంటే ట్రైలర్‌లో చూపించిన దాని ప్రకారం జైలర్ ఫస్ట్ హాఫ్‌లో హీరో ఓ అమాయకుడిలా కనిపిస్తాడు. ఇంట్లో కొడుకు, మనవడు, భార్య..ఇలా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు హీరోను చిన్నచూపు చూస్తుంటారు. అయితే అతడు బయటకు కనిపిస్తున్నది వేరు, గతం వేరే అనే విషయం తెలుస్తుంది. తనలో అసలు సిసలు యాక్షన్‌ను బయటకు తీస్తాడు. తర్వాత ఏం జరిగిందన్నది సినిమాలో చూడాలి. 2021లో వచ్చిన హాలీవుడ్ సినిమా నోబడి(Nobody) కూడా ఇలాగే ఉంటంది. ఇందులో వయసు అయిపోయిన వ్యక్తి భార్య బిడ్డలతో బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితులలో రష్యన్ మాఫియాతో తలపడతాడు. తనను నోబడి అనుకున్న వారందరికీ షాక్ ఇస్తాడు. ఇప్పుడు నోబడి, జైలర్ సినిమాల మధ్య పోలికలు కనిపిస్తుండటంతో కాపీ కొట్టారనే ప్రచారం జరుగుతోంది. జైలర్ సినిమా చూస్తే తప్ప అసలు విషయం తెలియదు.