సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) లేటెస్ట్‌ సినిమా జైలర్‌(Jailer) సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. ఈ మధ్య ఆయన నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇక రజనీ పని అయిపోయిందన్న విమర్శలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే నెల్సన్‌(Nelson) దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ తీస్తున్న సినిమాలో రజనీకాంత్‌ హీరోగా నటించనున్నారనే వార్త బయటకు వచ్చింది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) లేటెస్ట్‌ సినిమా జైలర్‌(Jailer) సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. ఈ మధ్య ఆయన నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇక రజనీ పని అయిపోయిందన్న విమర్శలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే నెల్సన్‌(Nelson) దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ తీస్తున్న సినిమాలో రజనీకాంత్‌ హీరోగా నటించనున్నారనే వార్త బయటకు వచ్చింది. చాలా మంది ఆశ్చర్యపోయారు. అంతకు ముందే విజయ్‌-నెల్సన్‌ కాంబినేషన్‌లో వచ్చిన బీస్ట్(Beast) సినిమా బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడింది. దాంతో జైలర్‌ సినిమాపై అపనమ్మకం పెట్టుకున్నారు కొందరు. రజనీకాంత్‌పై కూడా ఒత్తిడి పెరిగింది.

నెల్సన్‌ పనితీరుపై రజనీకాంత్‌కు పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌ వంటి స్టార్లు కూడా నటించారు. ప్రత్యేక పాత్రలో తమన్నా మెరిశారు. ఆగస్టు 10వ తేదీన జైలర్‌ రిలీజయ్యింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ విజయం విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విజయవంతం అయ్యింది. విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు జైలర్‌ 650 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసింది.

అనిరుధ్‌ అందించిన సంగీతం కూడా విజయంలో కీలకపాత్ర వహించింది. గత ఏడాది తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న పొన్నియన్‌ సెల్వన్‌, కమల్‌ నటించిన విక్రమ్‌ సినిమాల కలెక్షన్లు కూడా జైలర్‌ అధిగమించడం విశేషం. దీంతో సన్‌ పిక్చర్స్‌ వారు బోల్డంత సంతోషంతో ఉన్నారు. ఆ సంస్థ యజమాని కళానిధి మారన్‌ తాజాగా రజనీకాంత్‌ను కలుసుకుని తన సంతోషాన్ని ఆయనతో పచుకున్నారు. అంతేకాదు సినిమా లాభాల్లో కొంత భాగాన్ని రజనీకాంత్‌కి కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. రజనీకాంత్‌కు ఇచ్చిన చెక్కును కవర్‌పై ది రియల్ రికార్డ్ మేకర్ అని రాసి ఉండటం విశేషం. . ఇప్పటికే ఈ సినిమాకు రెమ్యునరేషన్‌గా 110 కోట్ల రూపాయలు తీసుకున్నారు రజనీకాంత్‌. సినిమాకు భారీగా లాభాలు రావడంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్ మరో వంద కోట్ల రూపాయలు ఇచ్చారట! మొత్తం మీద రజనీకాంత్‌ జైలర్‌ కోసం తీసుకున్న పారితోషికం 210 కోట్ల రూపాయలు. భారతీయ సినీ చరిత్రలో ఇదో రికార్డు.

Updated On 1 Sep 2023 8:06 AM GMT
Ehatv

Ehatv

Next Story