ఎన్నైనా చెప్పండి. రజనీకాంత్(Rajinikanth) రజనీకాంతే! 73 ఏళ్ల వయసులో కూడా సూపర్‌స్టార్‌ది అదే క్రేజ్.. ఆయనంటే ప్రేక్షకులకు అదే మోజు! ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. నిర్మాతలు క్యూలు కడుతూనే ఉన్నారు. రజనీతో సినిమా చేయడానికి డైరెక్టర్లు ఆసక్తి కనబరుస్తూనే ఉన్నారు. నెల్సన్ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న జైలర్ సినిమా(Jailer Movie) ఆల్‌మోస్టాల్ పూర్తయ్యింది. విడుదలకు రెడీ అవుతోంది.

Rajinikanth, Director Sudha Kongara Combo
ఎన్నైనా చెప్పండి. రజనీకాంత్(Rajinikanth) రజనీకాంతే! 73 ఏళ్ల వయసులో కూడా సూపర్‌స్టార్‌ది అదే క్రేజ్.. ఆయనంటే ప్రేక్షకులకు అదే మోజు! ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. నిర్మాతలు క్యూలు కడుతూనే ఉన్నారు. రజనీతో సినిమా చేయడానికి డైరెక్టర్లు ఆసక్తి కనబరుస్తూనే ఉన్నారు. నెల్సన్ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న జైలర్ సినిమా(Jailer Movie) ఆల్‌మోస్టాల్ పూర్తయ్యింది. విడుదలకు రెడీ అవుతోంది. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajinikanth) డైరెక్ట్ చేస్తున్న లాల్ సలాం(Lal Salaam)లో రజనీ కీలకమైన గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయ్యింది. జైభీమ్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న టి.జే.జ్ఞానవేల్ డైరెక్షన్‌లో రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్నారు. ఇది రజనీ కెరీర్‌లో 170వ సినిమా అవుతుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించబోతున్నది. రజనీ నటించే 171వ సినిమాకు కూడా గట్టి పోటీ ఉంది. చాలా మంది నిర్మాతలు రజనీ కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇద్దరు డైరెక్టర్లు ఆల్‌రెడీ స్టోరీని వినిపించారు కూడా. లోకేష్ కనకరాజ్ ఇప్పటికే రజనీకి కథ చెప్పారు. రజనీ కూడా ఓకే అనేశారు. ఇందులో కమల్‌హాసన్ కూడా నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఒకవేళ కమల్ నటిస్తే మాత్రం సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయి. ఇదిలా ఉంటే ఇరుదు చుట్రు, సూరరూపోట్రు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర కూడా రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయనున్నారట! బెంగళూరులోని ఓ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్‌ను సుధా కొంగర కలిసి కథను వినిపించారట. రజనీకి కథ బాగా నచ్చిందట! కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్!
