ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్(Sunrisers Hyderabad) గత కొన్ని సీజన్ల నుంచి పేలవమైన ఆట తీరును కనబరుస్తోంది. 2016లో టైటిల్‌ను గెల్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ 2108లో రన్నరప్‌గా నిలిచింది. తర్వాత నుంచి టీమ్ ప్రదర్శన ఘోరంగా తయారయ్యింది. ప్రతీ సీజన్‌కు ప్లేయర్లతో పాటు కోచ్‌లు కూడా మారుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్(Sunrisers Hyderabad) గత కొన్ని సీజన్ల నుంచి పేలవమైన ఆట తీరును కనబరుస్తోంది. 2016లో టైటిల్‌ను గెల్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ 2108లో రన్నరప్‌గా నిలిచింది. తర్వాత నుంచి టీమ్ ప్రదర్శన ఘోరంగా తయారయ్యింది. ప్రతీ సీజన్‌కు ప్లేయర్లతో పాటు కోచ్‌లు కూడా మారుతున్నారు. కానీ సన్‌రైజర్స్ ఆటతీరు మాత్రం మారడం లేదు. ఫ్యాన్స్ పూర్తి నిరాశలో ఉన్నారు. 2023లో అయితే మరీ దారుణం.. ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మ్యాచ్‌లలోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. లేటెస్ట్‌గా సన్‌రైజర్స్ టీమ్ ప్రదర్శనపై సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ యజమాని కావ్యా మారన్(Kavya Maran) పడే బాధను తాను చూడలేకపోతున్నానని అన్నారు. రజనీ హీరోగా వస్తున్న జైలర్(Jailer) సినిమా ఆడియో ఫంక్షన్(Audio Function) జరిగింది. ఈ వేడకలో రజనీ ఈ మాట అన్నారు. ఎష్ఆర్‌హెచ్ మ్యాచ్ ఓడిపోయిన ప్రతీసారి స్టేడియంలో కావ్య నిరాశగా ఉండటం చూడలేకపోతున్నానని, చాలా సార్లు టీవీ ఛానల్‌ను మార్చేశానని రజనీ అన్నారు. అందుకే కళానిధి మారన్‌కు తాను ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. 'జట్టులో మంచి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలి. వేలంలో మెరుగైన ఆటగాళ్లను తీసుకోవాలి. జట్టును బలోపేతం చేయాలి' అని రజనీ పేర్కొన్నారు. జైలర్ చిత్రాన్ని నిర్మించింది కళానిధి మారనే!ఆయన కూతురే కావ్యా మారన్!