గత ఏడాది తమిళ నటుడు ధనుష్‌(Danush), ఐశ్వర్య రజనీకాంత్‌(Aishwarya Rajinikanth) దంపతులు విడిపోయారు. 18 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు వీరిద్దరు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. మళ్లీ కొన్ని రోజులకు తాము విడిపోవడం లేదని, విడాకులు రద్దు చేసుకుంటున్నామని ప్రకటించినట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే దీనిపై అటు ధనుశ్‌ కానీ, ఇటు ఐశ్వర్య కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

గత ఏడాది తమిళ నటుడు ధనుష్‌(Danush), ఐశ్వర్య రజనీకాంత్‌(Aishwarya Rajinikanth) దంపతులు విడిపోయారు. 18 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు వీరిద్దరు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. మళ్లీ కొన్ని రోజులకు తాము విడిపోవడం లేదని, విడాకులు రద్దు చేసుకుంటున్నామని ప్రకటించినట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే దీనిపై అటు ధనుశ్‌ కానీ, ఇటు ఐశ్వర్య కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రజనీకాంత్‌(Rajinikanth) వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నారన్న కథనాలు కూడా వచ్చాయి. కాకపోతే ధనుష్‌, ఐశ్వర్య మళ్లీ కలవడం అసాధ్యం అని తేలిపోయింది. అందుకే ఫ్యాన్స్‌ కూడా ఈ విషయానికి పెద్దగా ఇంపార్టెన్స్‌ ఇవ్వడం లేదు. అదలా ఉంచితే తాజాగా ఐశ్వర్య రజనీకాంత్‌ రెండో పెళ్లి(Re-Marry) చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్‌ మీడియాలో(social Media) అయితే కథనాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో సింగిల్‌ మదర్‌గానే ఉంటున్నారు.

అంతే కాకుండా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇలాంటి వదంతులు రావడానికి ప్రధాన కారణం ఆ మధ్య ఐశ్వర్య ఓ తమిళ హీరోతో కనిపించడమే! చెన్నైలోని ఓ రిసార్ట్‌లో ఐశ్వర్య ఆ హీరోతో సన్నిహితంగా మెలుగుతూ కనిపించారట! అప్పట్నుంచి రెండో పెళ్లిపై పుకార్లు వ్యాపించసాగాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, సామాజిక మాధ్యమాలలో అయితే రోజుకో కథనం వస్తోంది. ఈ విషయంపై ఐశ్వర్య రజనీకాంత్‌ స్పందిస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. లేకపోతే ఇలాంటి వదంతుల వల్ల ఇమేజ్‌ దెబ్బతింటుందని అంటున్నారు. అసలు ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌లు ఎందుకు విడిపోయారో ఎవరికీ తెలియదు. తామిద్దరం విడిపోతున్నట్లు మొదట ఐశ్వర్య ప్రకటించారు. తర్వాత ధనుష్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది చూసి ఫాన్స్‌ షాకయ్యారు. సుచీ లీక్స్‌లో ధనుష్‌ ఫోటోలు బయటకు వచ్చిన రోజు నుంచే దంపతుల మధ్య గొడవ మొదలయ్యిందట! ఆ తర్వాత కూడా ధనుష్‌ ఓ హీరోయిన్‌తో చనువుగా ఉండటం ఐశ్వర్యకు నచ్చలేదట! అందుకే విడాకులు ఇవ్వడానికి ఐశ్వర్య రెడీ అయ్యారు.

Updated On 11 July 2023 7:45 AM GMT
Ehatv

Ehatv

Next Story