చాలా కాలం తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కు భారీ బ్లాక్ బస్టర్ వచ్చింది. జైలర్(Jailer) సినిమాతో రజినీకాంత్ కెరీర్ లోనేనే భారీ కలెక్షన్స్ సాధించాడు. ఆయన మార్కెట్ కూడా భారీగా పెరిగింది. రజినీకాంత్ పని అయిపోయింది అన్నవారికి జైలర్ సినిమా గట్టిగా సమాధానం చెప్పింది. తమిళ యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson dilip kumar) 'జైలర్' సినిమాను రూపొందించాడు.

చాలా కాలం తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కు భారీ బ్లాక్ బస్టర్ వచ్చింది. జైలర్(Jailer) సినిమాతో రజినీకాంత్ కెరీర్ లోనేనే భారీ కలెక్షన్స్ సాధించాడు. ఆయన మార్కెట్ కూడా భారీగా పెరిగింది. రజినీకాంత్ పని అయిపోయింది అన్నవారికి జైలర్ సినిమా గట్టిగా సమాధానం చెప్పింది. తమిళ యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson dilip kumar) 'జైలర్' సినిమాను రూపొందించాడు. 2023 ఆగస్టు 10న తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ అయిన ఈసినిమా దాదాపు 600 కోట్లు కలెక్ట్ చేసి సంచలనంగా మారింది.

సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి భాషలో వసూళ్ల పరంగా దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా రజనీకి ఉన్న క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదని ఈసినిమాతో నిరూపించింది. అయితే ఈసినిమాకు సీక్వెల్(Sequel) గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈమూవీ హిట్ అయిన తరువాత నుంచి ఈమూవీకి సీక్వెల్ చేయబోతున్నాన్న న్యూస్ వినిపిస్తుంది. కాని అఫీషియల్ గా మాత్రం ఎవరూ ప్రకటనలు చేయలేదు. తాజాగా ఈమూవీ సీక్వెల్ కు రంగం సిద్దం అయిందని సమాచారం. నెల్సన్ వినిపించిన కథకి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

ప్రస్తుతం నెల్సన్ సీక్వెల్ కు సబంధించిన కంప్లీట్ స్టోరీని తయారు చేసే పనిలో ఉన్నాడట. సమాజానికి హాని చేయడానికి ప్రయత్నించిన కొడుకును చంపడానికి వెనుకాడని ఒక 'జైలర్' కథ ఇది. మరి జైలర్ 2′ కథ ఎక్కడి నుంచి మొదలవుతుందా అని అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన అఫీషియల అనౌస్మెంట్ కూడావచ్చే అవకాశం ఉంది.

ఇక కథలో భాగంగా మొదటి పార్ట్ సినిమాల జాకీష్రాఫ్ .. మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో మెరిశారు. మరి పార్ట్ 2 లో కూడా ఇలానే ఎవరైనా స్టార్స్ కనిపిస్తారా లేదా అన్నది చూడాలి. ఈసినిమాలోనెల్సన్ కథాకథనాలు .. రజనీ లుక్ .. ఆయన మార్క్ స్టైల్ .. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. వినాయకన్ విలనిజం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

Updated On 22 Jan 2024 7:27 AM GMT
Ehatv

Ehatv

Next Story