రిలీజైన రోజు నుంచి హవా చూపిస్తోంది జైలర్ సినిమా. రిలీజ్ అయ్యిదాదాపు వారం దాటుతున్న ఇంకా జైలర్‌ హవా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తమిళ, తెలుగు, కన్నడ బాషల్లో తలైవా.. కలెక్షన్లు కొల్లగొడుతూ.. ప్రకంపనలు సృష్టిస్తొంది. రజినీ మ్యానియా గట్టిగా నడుస్తోంది. అంతే కాదు వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సూపర్ స్టార్ కు సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడంతో పాటు..

దిల్ రాజు(Dilraju) నక్క తోక తొక్కినట్టున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) జైలర్(Jailer) సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన దిల్ రాజు.. భారీ లాభాలను జేబులో వేసుకున్నారు. ఇంతకీ ఎంత సాధించారంటే..?

రిలీజైన రోజు నుంచి హవా చూపిస్తోంది జైలర్ సినిమా. రిలీజ్ అయ్యిదాదాపు వారం దాటుతున్న ఇంకా జైలర్‌ హవా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తమిళ, తెలుగు, కన్నడ బాషల్లో తలైవా.. కలెక్షన్లు కొల్లగొడుతూ.. ప్రకంపనలు సృష్టిస్తొంది. రజినీ మ్యానియా గట్టిగా నడుస్తోంది. అంతే కాదు వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సూపర్ స్టార్ కు సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడంతో పాటు.. ఇప్పటి వరకూ 400 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా సాధించింది. ఇక తెలుగులో దాదాపు పుష్కర కాలంగా హిట్టు చూడని రజనీకు.. జైలర్‌ బంపర్ హిట్ కొట్టేసింది. మాములుగా ఒక సినిమా బిజినెస్‌ ఆ ఫలానా హీరో గత సినిమాల కలెక్షన్‌లను బట్టి జరుగుతుంది.

అదే విధంగా జైలర్‌ సినిమా తెలుగు బిజినెస్‌ కూడా గత సినిమా వసూళ్లను బట్టి బిజినెస్‌ జరుపుకుంది. గతంలో రజనీకాంత్ సినిమాల కలెక్షన్స్ దృష్యా.. జైలర్ సినిమాకు తెలుగులో పెద్దగా ప్రీరిలీజ్ బిజినెస్ జరగలేదు. సినిమా తీసుకోవడానికి సంకోచించారు జనాలు. దాంతో 12 కోట్లకు బిజినెస్‌ లెక్కలను క్లోజ్‌ చేసుకుంది.

ఏషియన్‌ సునీల్‌ నారంగ్‌తో కలిసి దిల్‌రాజు ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేశాడు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా తెలుగులో బ్రేక్‌ ఈవెన్‌ మార్క్‌ను దాటేసింది. ఇక మూడో రోజు నుంచి లాభాల బాట పట్టింది. ఎన్ని లెక్కలు వేసుకున్న మహా అయితే ఈ సినిమా పది కొట్ల లాభాలు తెస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని రేంజ్‌లో ఈ సినిమాకు రెస్పాన్స్‌ రావడం.. పోటీగా వచ్చిన భోళా దిబేల్‌మని పడిపోవడంతో ఈ సినిమా కలెక్షన్‌లకు రెక్కలొచ్చాయి.

ఏసినిమాకు అయినా.. రిలీజ్ తరువాత టికెట్లు తగ్గుతాయి.. సీట్లు ఖాళీ అవుతాయి.. కాని ఈసినిమాకు మాత్రం వరుసగా టికెట్లు తెగుతూనే ఉన్నాయి. ఇక జైలర్ సినిమా ఇప్పటి వరకూ తెలుగులో దాదాపు 30 కోట్లకు పైగా కలెక్షన్‌లు వచ్చాయి. ఇంకా సూపర్ స్పీడ్ గా ఉన్న ఈమూవీ స్పీడ్‌ చూస్తుంటే మరో 20 కోట్ల షేర్‌ ఈజీగా రాబట్టేలా ఉంది. ఇక ఈమూవీ తో దిల్ రాజుకు కళ్లు చెదిరే లాభాలు ఆర్జించారు. టాలీవుడ్ లో ఇదే ప్రముఖంగా మాట్లాడుకుంటున్నారు.

Updated On 19 Aug 2023 1:45 AM GMT
Ehatv

Ehatv

Next Story