సలార్‌(Salaar) విజయంతో డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇప్పుడు కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాపై దృష్టి పెట్టాడు ప్రభాస్‌. మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌Nag ashwin) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్‌ వీడియో విడుదలయ్యి సోషల్‌ మీడియా హాట్‌టాపిక్‌గా మారింది.

సలార్‌(Salaar) విజయంతో డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇప్పుడు కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాపై దృష్టి పెట్టాడు ప్రభాస్‌. మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌Nag ashwin) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్‌ వీడియో విడుదలయ్యి సోషల్‌ మీడియా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పడుకొనే, దిశా పటానీలతో పాటు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, లోకనాయకుడు కమలహాసన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మరో పాపులర్‌ యాక్టర్‌ ఈ సినిమాలో చేరారు. ఆయన ఎవరంటే లెజండరీ యాక్టర్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌. కలియుగ పట్నంలో టీజర్‌ లాంఛ్ ఈవెంట్‌లో ఈ అప్‌డేట్‌పై క్లారిటీ వచ్చింది. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. రాజేంద్రప్రసాద్‌ (Rajendraprasad) ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తాడన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా మే 9వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతీ మూవిస్‌(Vyjayanthi movies) సంస్థకు ఆ తేదీతో ప్రత్యేక అనుబంధం ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), బ్యూటీ క్వీన్‌ శ్రీదేవి(Sri devi) నటించిన సూపర్‌ డూపర్‌ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి ఈ రోజునే విడుదలయ్యింది. అలాగే మహానటి సినిమా కూడా! ఈ రెండు సినిమాలు వైజయంతి మూవీస్‌ బ్యానర్‌కు చిరకీర్తిని తెచ్చిపెట్టాయి. ప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated On 1 March 2024 12:52 AM GMT
Ehatv

Ehatv

Next Story