కలలు కనాలంటే నిద్రపోతే సరిపోతుంది. కానీ కలలు నిజం చేసుకోవాలంటే మాత్రం నిద్రని పోగొట్టుకోవాలి. త్యాగాలకు సిద్దపడాలి. ఓ మినీ యుద్ధమే చేయాలి. వీటన్నింటికీ సిద్ధపడ్డాడు కాబట్టే... రాజమౌళి దిగ్విజయ యాత్ర నిరాటంకంగా సాగుతోంది. ఆ మినీ యుద్ధమే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.. ఈ క్రమంలోనే RRR చరిత్ర సృష్టించింది. లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రానికి ఆస్కార్ దక్కింది. నాటు నాటు సాంగ్‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ గెలుచుకుంది.

కలలు కనాలంటే నిద్రపోతే సరిపోతుంది. కానీ కలలు నిజం చేసుకోవాలంటే మాత్రం నిద్రని పోగొట్టుకోవాలి. త్యాగాలకు సిద్దపడాలి. ఓ మినీ యుద్ధమే చేయాలి. వీటన్నింటికీ సిద్ధపడ్డాడు కాబట్టే... రాజమౌళి దిగ్విజయ యాత్ర నిరాటంకంగా సాగుతోంది. ఆ మినీ యుద్ధమే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.. ఈ క్రమంలోనే RRR చరిత్ర సృష్టించింది. లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రానికి ఆస్కార్ దక్కింది. నాటు నాటు సాంగ్‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ గెలుచుకుంది. ఈ అస్కార్స్ వేడుక అనంతరం అక్కడే ఈ సక్సెస్ ను RRR టీమ్ పార్టీ చేసుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.. ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన ఇల్లు గురించే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే లాస్ ఏంజిల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన వేడుక అనంతరం RRR టీమ్ మొత్తం పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, శోభు యార్లగడ్డ, వారాహి సాయి కొర్రపాటి సహా వారి మిత్రులు చాలా మంది పాల్గొన్నారు. . RRR టీమ్ పార్టీ నిర్వహించిన ఇంటిని రాజమౌళి అద్దెకు తీసుకున్నాడనే న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

రాజమౌళి తన అప్‌కమింగ్ మూవీస్ కోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని సమచారం . సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమాను ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచరస్ ఫిల్మ్‌గా రూపొందించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన గత ఆరు నెలల్లో అమెరికాకు చాలాసార్లు వెళ్లాల్సి వచ్చింది. అయితే వెళ్లిన ప్రతిసారి స్టేయింగ్ కోసం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి లాస్ ఏంజిల్స్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అతని టీమ్ మొత్తం అక్కడే ఉంటోందని సమాచారం. అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రం సమీపంలోని 7-స్టార్ హోటల్‌లో ఉంటున్నారని వెల్లడైంది.

జక్కన్న మాత్రం ఒక ప్రత్యేక కారణంతో ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నారట. తన రాబోయే సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్ల సహకారం అవసరముంది. దీంతో చాలా మంది ఏజెంట్లు, నిర్మాతలు, ప్రొడక్షన్ హౌస్‌లు.. రాజమౌళిని క్రమం తప్పకుండా కలుస్తున్నారు. అందుకే జక్కన్న ఇప్పుడు లాస్ ఏంజిల్స్‌ను తన రెండో ఇంటిగా మార్చేసుకున్నాడని టాక్.

ఏదేమైనా ఆస్కార్ విజయంతో భారతీయ సినిమాకు విశ్వ వేదికపై గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి.. తదుపరి ప్రాజెక్ట్‌ను RRR చిత్రానికి మించి రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించనుండగా.. ఈ మూవీ ఇదే ఏడాది జూన్‌లో సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Updated On 15 March 2023 2:37 AM GMT
Ehatv

Ehatv

Next Story