దర్శకుడు రాజమౌళి(Rajamouli) కుమారుడు కార్తికేయ(Karthikeya)కూడా దర్శకుడే !
దర్శకుడు రాజమౌళి(Rajamouli) కుమారుడు కార్తికేయ(Karthikeya)కూడా దర్శకుడే ! ఇతడు నాగబాబు(Nagababu)కూతురు నిహారిక(Niharika),నాగార్జున(Nagarjuna) చిన్న కొడుకు అఖిల్(Akhil)లతో ఓ షార్ట్ ఫిలిం తీశాడట! తను తీసిన ఆ షార్ట్ ఫిలింను రాజమౌళికి చూపించి అభిప్రాయం అడిగాడట! ఈ సినిమాను బయట ప్రపంచానికి చూపించకుండా ఉండటమే మంచిదని రాజమౌళి చెప్పడంతో ఆ షార్ట్ ఫిల్మ్‌ను తిలకించే అదృష్టం ప్రేక్షకులకు లేకుండా పోయింది. ఈ విషయాన్ని స్వయంగా నిహారికే చెప్పింది. రీసెంట్‌గా ఆమె కమిటీ కుర్రాళ్లు అనే సినిమా తీసి సక్సెస్ కొట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. అందులో ఈ విషయాన్ని వెల్లడించింది. విశ్వక్సేన్ (VishwakSen)కూడా నిహారికతో ఓ షార్ట్ ఫిలిం తీశాడట కానీ అది కూడా విడుదల కాలేదట! ఈ విషయాన్ని నిహారిక దగ్గర ప్రస్తావిస్తే 'ఆ సంగతి పక్కన పెడదాం. నేను అఖిల్ హీరోయిన్ హీరోలుగా ఓ షార్ట్ ఫిలిం తీశారు. దానికి దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ దర్శకత్వం వహించాడు ' అని నిహారిక తెలిపింది. ఆ సమయంలో తనకు యాక్టింగ్ అంటే చాలా పిచ్చి ఉండేదని, అప్పుడు తన పళ్లకు బ్రేసెస్ ఉండేవని, ఆ షార్ట్ ఫిలిం కోసం ఆ బ్రేసెస్ కూడా తీసేశానని నిహారిక తెలిపింది. ఆ సినిమా అస్సలు బాగోలేకపోవడంతో రాజమౌళి సలహా మేరకు బయటకు రిలీజ్ చేయలేదని నిహారిక చెప్పుకొచ్చింది.