జూనియర్ ఎన్టీఆర్ నటనకు కొత్తగా ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. తనో గొప్ప నటుడని ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడతను! కాకపోతే పొగడాల్సిన వాళ్లు పొడిగితే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది.. లెటెస్ట్‌గా ఎన్టీఆర్‌పై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. సందర్భం ఏమిటయ్యా అంటే జనవరి 11న జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం! వేదిక ఆస్‌ఏంజిల్స్.. ఈ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నామినేట్ అయ్యింది.. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ విభాగంలోనూ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట నామినేట్ అయ్యాయి.

అంగరంగ వైభవంగా అవార్డుల కార్యక్రమం ముగిసిన వెంటనే అక్కడే ఉన్న డీజీఏ థియేటర్‌లో ట్రిపులార్ సినిమాను ప్రదర్శించారు. దీనికి జక్కన్న, తారక్ హాజరయ్యారు. అప్పుడే రాజమౌళి ఎన్టీఆర్ నటనను అమితంగా మెచ్చేసుకున్నాడు. ఓ రకంగా ఆకాశానికెత్తేశాడని చెప్పుకోవచ్చు. ట్రిపులార్‌లో తనకు కొమురం భీముడో అన్న పాట అంటే చాలా చాలా ఇష్టమన్న జక్కన్న అందులో తారక్ నటన మహాద్భుతమన్నాడు. తాను డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటిలోనూ ఆ పాటే తనకు ఇష్టమని, ఆల్ టైమ్ ఫేవరెట్ అని రాజమౌళి మనసులో మాట చెప్పాడు. తారక్ కనుబొమ్మల పై కెమెరా ఫోకస్ చేస్తే వాటితోనూ అతడు హావభావాలను పలికించగలడు అంటూ తారక్‌ను పొగిడేశాడు రాజమౌళి. వారి మధ్య ఉన్న అటాచ్‌మెంట్ అలాంటిది మరి!