అతిపెద్ద భారతీయ చిత్రం గా చెబుతున్నారు

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కొత్త సినిమా ఎప్పుడు మొదలుపెడతారా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌లో ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించబోతున్నారు.

అతిపెద్ద భారతీయ చిత్రం గా చెబుతున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ దగ్గర నుండి పలు దేశాలకు సంబంధించిన స్టార్స్ ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా ప్రారంభించలేదు. మహేష్ లేదా కృష్ణ పుట్టినరోజున మేకర్స్ సినిమాను మొదలుపెడతారని అభిమానులు ఆశించారు. కానీ కొన్ని కారణాల వలన సినిమా ప్రకటన ఆలస్యం అవుతోంది. తాజా నివేదికల ప్రకారం, అక్టోబర్ 10న అంటే జక్కన్న 51వ పుట్టినరోజున సినిమా అప్డేట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ నెలలో సినిమా నిర్మాణాన్ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్నారు. సినిమాకు పనిచేసే వారి గురించి త్వరలోనే అప్డేట్ రానుంది.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story