ట్రిపులార్‌(RRR) సినిమాలో నటించిన బ్రిటిషన్‌ నటుడు రే స్టీవెన్సన్‌(Ray Stevenson) మరణించారు. 58 ఏళ్ల వయసున్న ఆయన ట్రిపులార్‌లో బ్రిటిష్‌ గవర్నర్‌ స్కాట్ బక్స్‌టన్‌ పాత్రను పోషించారు. స్కాట్‌దొర పాత్రలో విలనీజాన్ని పండించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన రే స్టీవెన్సన్‌ హఠాన్మరణం అందరినీ కలచివేసింది. ఇటలీలో తన కొత్త చిత్రం క్యాసినో షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన ఆదివారమే చనిపోయినట్టు తెలుస్తోంది.

ట్రిపులార్‌(RRR) సినిమాలో నటించిన బ్రిటిషన్‌ నటుడు రే స్టీవెన్సన్‌(Ray Stevenson) మరణించారు. 58 ఏళ్ల వయసున్న ఆయన ట్రిపులార్‌లో బ్రిటిష్‌ గవర్నర్‌ స్కాట్ బక్స్‌టన్‌ పాత్రను పోషించారు. స్కాట్‌దొర పాత్రలో విలనీజాన్ని పండించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన రే స్టీవెన్సన్‌ హఠాన్మరణం అందరినీ కలచివేసింది. ఇటలీలో తన కొత్త చిత్రం క్యాసినో షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన ఆదివారమే చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఆయన చనిపోవడానికి గల కారణాలేమిటో ఇంకా తెలియలేదు. రే స్టీవెన్సన్‌ పూర్తి పేరు జార్జ్‌ రేమండ్‌ స్టీవెన్సన్‌(George Raymond Stevenson). చాలా చిత్రాలలో ఆయన నటించారు. టెలివిజన్‌ సిరీస్‌ల్లోనూ స్టీవెన్సన్‌ నటించారు.

1964 మే 25వ తేదీన నార్త్‌ ఐర్లాండ్‌లోని లిస్‌బర్న్‌లో స్టీవెన్సన్‌ జన్మించారు. తండ్రి రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌. 29 సంవత్సరాల వయసులో బ్రిస్టల్‌ ఓల్డ్‌ విక్‌ థియేటర్‌ స్కూల్‌లో యాక్టింగ్‌ కోర్స్‌ పూర్తి చేశారు రే స్టీవెన్సన్‌. నాటకాల్లో నటిస్తూ సినిమాల్లో అడుగుపెట్టారు. 1998లో వచ్చిన ది థియరీ ఫ్టెల్‌ ఆయన మొదటి సినిమా. 2004లో వచ్చిన కింగ్‌ ఆర్థర్‌ సినిమాలో ఆయన పోషించిన డాగోనెట్‌ పాత్ర ఆయనకు ఎంతగానో పేరు తెచ్చింది.

హెచ్‌బీవో(HBO) రోమ్‌ టీవీ సిరీస్‌లో టైటస్‌ పులోగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. థోర్‌, స్టార్‌వార్స్‌ వంటి హిట్‌ సినిమాల్లోనూ స్టీవెన్సన్‌ నటించారు. బ్రిటిష్‌ నటి రుత్‌ గెమ్మెల్‌ను వివాహం చేసుకున్నారు స్టీవెన్‌సన్‌. బాండ్‌ ఆఫ్‌ గోల్డ్‌ సినిమా అప్పుడు వీరి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. 1997లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అదే సంవత్సరం పీక్‌ ప్రాక్టీస్‌ అనే చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. అయితే ఎనిమిదేళ్ల సంసారం తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. స్టీవెన్సన్‌ మృతి పట్ల ట్రిపులార్‌ చిత్ర యూనిట్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సర్‌ స్కాట్‌.. మీరెప్పుడూ మా గుండెల్లో నిలిచి ఉంటారని ట్వీట్‌ చేసింది.

Updated On 23 May 2023 12:54 AM GMT
Ehatv

Ehatv

Next Story