ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie0తో ఆస్కార్ ముచ్చట కూడా తీర్చేశాడు రాజమౌళి(Rajamouli). తెలుగు సినిమాకు ఉన్నత స్థాయి తీసుకువచ్చి.. టాలీవుడ్ సినిమా సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం రాజమౌళి. ఆర్ఆర్ఆర్ అంత సక్సెస్ అవ్వడం.. ఆస్కార్(Oscar) కూడా రావడంతో.. రాజమౌళి నెక్ట్స్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జక్కన్న బాధ్యత కూడా పెరిగింది.

మహేష్ బాబు(Mahesh Babu) సినిమాను గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli). నెక్ట్స్ సినిమా కోసం బాలీవుడ్ నుంచి స్టార్స్ ను దించబోతున్నాడట.

ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie0తో ఆస్కార్ ముచ్చట కూడా తీర్చేశాడు రాజమౌళి. తెలుగు సినిమాకు ఉన్నత స్థాయి తీసుకువచ్చి.. టాలీవుడ్ సినిమా సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం రాజమౌళి. ఆర్ఆర్ఆర్ అంత సక్సెస్ అవ్వడం.. ఆస్కార్(Oscar) కూడా రావడంతో.. రాజమౌళి నెక్ట్స్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జక్కన్న బాధ్యత కూడా పెరిగింది. ఆర్ఆర్ఆర్ అఖండ విజయం తర్వాత ఆయన తీయబోయే తదుపరి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందా అని ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భారీ అడ్వెంచర్‌‌ మూవీ ప్లాన్ చేశాడు రాజమౌళి. ఈసినిమాను రాజమౌళి ఎప్పుడో ప్రకటించారు. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రప్ట్ పనులు పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ఈసినిమా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. అందుకు తగ్గట్టుగానే నటీనటులను ఎంపిక చేసే పనిలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. అంతే కాదు ఈ భారీ సినిమాలో కీలక పాత్రల కోసం ముగ్గురు బాలీవుడ్ నటులను తీసుకుంటారని తాజా సమాచారం. ఆర్ఆర్ఆర్ కోసం ఓ హీరోయిన్‌గా ఆలియా భట్ తో పాటు అజయ్ దేవగణ్ ను తీసుకున్న జక్కన్న ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మహేశ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి చిత్రంకోసం మేకోవర్ కానున్నారు. ప్రత్యేకంగా మూడు నెలల పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన శిక్షణ తీసుకుంటారని తెలుస్తోంది.

Updated On 16 July 2023 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story