సినీ నటుడు రాజ్‌తరుణ్(Raj tharun)-లావణ్య(Lavanya) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది.
సినీ నటుడు రాజ్‌తరుణ్(Raj tharun)-లావణ్య(Lavanya) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. రాజ్‌తరుణ్ తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని, తనకు గర్భం వచ్చినా కూడా అబార్షన్(Abortion) చేశాడని, ఇప్పుడ మాల్వీ(Malvi malhotra) అనే హీరోయిన్‌తో ఉంటున్నాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను పోలీసులకు సమర్పించడంతో రాజ్‌తరుణ్, మాల్వీ, ఆమె సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కల్యాణ్ దిలీప్ సుంకర కూడా జోక్యం చేసుకుంటున్నాడు. తనపై కేసులు నమోదు కావడంతో రాజ్‌తరుణ్ పారిపోయాడని లావణ్య చెప్తోంది.
రాజ్‌తరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 420, 493, 506 కింద కేసులు నమోదు చేశారు. ఏ1గా రాజ్‌తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మాల్వీ సోదరుడిపై కేసులు నమోదు చేశారు. ఈ సమయంలోనే లావణ్య కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు వెనక్కి తీసుకోవాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తోంది. కేసు వెనక్కి తీసుకుంటే తనకు రూ.5 లక్షలు ఇస్తామని మెసేజెస్ పెడుతున్నట్లు తెలిపింది. అయితే రాజ్‌తరుణ్ ఫోన్ మాత్రం స్విచాఫ్ వస్తోందని, అతను పారిపోయాడని లావణ్య ఆరోపిస్తోంది. రాజ్‌తరుణ్ కోసం మా కుటుంబం ఇప్పటివరకు రూ.70 లక్షలు ఖర్చు చేసిందని, అతనికున్న ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తన కుటుంబమే భరించిందని లావణ్య చెప్తోంది. రాజ్‌తరుణ్ కుక్కల కారణంగా ఆరేళ్లలో ఆరు ఇళ్లు మార్చామని లావణ్య అంటోంది. 2016లో తనకు ప్రెగ్నెన్సీ వస్తే కూడా అబార్షన్ చేయించాడని, అందుకు సంబంధించిన మెడికల్ బిల్స్ కూడా పోలీసులకు అందజేసినట్లు లావణ్య వాదిస్తోంది. మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని, వాళ్ల బెదిరింపులకు తాను లొంగిపోయేది లేదని లావణ్య అంటోంది. మరోవైపు లావణ్యతో పాటు ఆమె తరపున లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర కూడా గట్టిగానే వాదిస్తున్నాడు. రాజ్‌తరుణ్‌పై అన్ని ఆధారాలు ఉన్నట్లు, అవన్నింటినీ పోలీసులతో పాటు కోర్టులో కూడా సమర్పిస్తామని ఆయన తెలిపారు. రాజ్‌తరుణ్ ఇక నుంచి లావణ్యపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కల్యాణ్ దిలీప్ సుంకర హెచ్చరించారు.