రాజ్‌కుమార్‌ రావ్‌(Raj kumar), శ్రద్ధా కపూర్‌(shraddha kapoor) ముఖ్య పాత్రలు పోషించిన సినిమా స్త్రీ-2(stree-2).

రాజ్‌కుమార్‌ రావ్‌(Raj kumar), శ్రద్ధా కపూర్‌(shraddha kapoor) ముఖ్య పాత్రలు పోషించిన సినిమా స్త్రీ-2(stree-2). ఇండిపెండెన్స్‌ డే రోజున విడుదలైన ఈ సినిమా రికార్డు వసూళ్లను సాధించింది. పెద్ద పెద్ద సినిమాల కంటే ఎక్కువగా కలెక్షన్లు సంపాదించింది. ఇప్పటికే 500 కోట్ల రూపాయలుపైగా నెట్‌ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. మొదటి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా అనేక రికార్డులను సాధించింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రాల లిస్టులో స్త్రీ -2 సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో మేకర్స్‌ ఫుల్లు ఖుషీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ-2 సినిమా టికెట్లపై మేకర్స్‌ బంపరాఫర్‌ ప్రకటించారు. ఒక టికెట్‌ కొంటే మరో టికెట్ ఫ్రీగా(Free Tickets) పొందవచ్చని తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చారు. ఈ టికెట్‌ ఆఫర్ 1+1‌ పొందేందుకు బుక్‌ మై షో యాప్‌లో STREE2 ప్రోమో కోడ్‌ ఉపయోగించాలని చిత్ర బృందం సూచించింది. అయితే ఈ ఆఫర్ కేవలం సెప్టెంబరు 13న మాత్రమేనని స్పష్టం చేసింది. థియేటర్లలో ఈ సినిమా చూడాలనుకునేవారు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.

Eha Tv

Eha Tv

Next Story