ఫ్రాన్స్ లో(France) ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు(Cannes Film Festival) హాజరు కావాలని వనపర్తికి(Wanaparthy) చెందిన రాఘవేందర్‌(Raghavendar) అనే యువకుడికి ఆహ్వానం అందింది. రాఘవేందర్ ఎడిటింగ్ చేసిన “ఇన్ రీ ట్రీట్”(IN RETREAT) అనే గంట 15 నిమిషాలపాటు ఉండే లడక్ ప్రాంతీయ భాషా చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి ఎంపిక అయింది.

ఫ్రాన్స్ లో(France) ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు(Cannes Film Festival) హాజరు కావాలని వనపర్తికి(Wanaparthy) చెందిన రాఘవేందర్‌(Raghavendar) అనే యువకుడికి ఆహ్వానం అందింది. రాఘవేందర్ ఎడిటింగ్ చేసిన “ఇన్ రీ ట్రీట్”(IN RETREAT) అనే గంట 15 నిమిషాలపాటు ఉండే లడక్ ప్రాంతీయ భాషా చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి ఎంపిక అయింది. దీంతో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి వనపర్తికి చెందిన యువకుడు రాఘవేందర్ కు ఆహ్వానం అందింది. “ఇన్ రీ ట్రీట్” అనే షార్ట్‌ ఫిలిం 30 ఏళ్ల క్రితం ఊరు వదిలి వెళ్లిన ఓ వ్యక్తి తన సొంత ప్రాంతానికి తిరిగివచ్చి పొందిన మానసిక భావోద్వేగాల ఆధారంగా తెరకెక్కించారు. ఫుణెలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో పీజీ డిప్లొమా పూర్తిచేసిన రాఘవేందర్ మల్లేశం, హౌ ఇస్ దట్ ఫర్ మండే అనే రెండు చిత్రాలకు ఎడిటింగ్ చేసి ప్రతిభను చాటాడు. సినీ ప్రముఖల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న రాఘవేందర్ తాను ఎడిటింగ్ చేసిన మూడో సినిమా ఇన్ రీట్రీట్ ఏకంగా కెన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక కావడంతో సినీ ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

Updated On 15 May 2024 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story