అన్నీ మంచి శకునములే సినిమా ఈవెంట్‌లో సీతారామం పార్ట్‌ 2(sitha ramam-2) గురించి డైరెక్టర్‌ రాఘవేంద్రరావు(Raghavendra rao) ప్రస్తావించిన తర్వాత, ఆయన మాటలను కొనసాగిస్తూ నిర్మాత స్వప్నాదత్‌(Swapna dat) జగదేకవీరుడు అతిలోకసుందరి పార్ట్‌ 2(Jagadekavirudu Athilokasundhari-2) గురించి ఆలోచించమని చెప్పారు.

అన్నీ మంచి శకునములే సినిమా ఈవెంట్‌లో సీతారామం పార్ట్‌ 2(sitha ramam-2) గురించి డైరెక్టర్‌ రాఘవేంద్రరావు(Raghavendra rao) ప్రస్తావించిన తర్వాత, ఆయన మాటలను కొనసాగిస్తూ నిర్మాత స్వప్నాదత్‌(Swapna dat) జగదేకవీరుడు అతిలోకసుందరి పార్ట్‌ 2(Jagadekavirudu Athilokasundhari-2) గురించి ఆలోచించమని చెప్పారు. దీనికి స్పందించిన రాఘవేంద్రరావు ప్రస్తుతం తన అవసరం ఎవరికీ లేదని, అశ్వనీదత్‌(Ashwani dat) ఇంట్లోనే ఓ మంచి దర్శకుడు(నాగ అశ్విన్‌) ఉన్నాడని, అలాగే అల్లు అరవింద్‌(Allu Arvindh) ఇంట్లో ఓ మంచి హీరో(అల్లు అర్జున్‌) ఉన్నాడని చమత్కారంగా మాట్లాడారు. కథనంతా తయారుచేసుకుని, ప్రాజెక్టు ప్రారంభమైతే తాను వెనుక నిలబడి పర్యవేక్షిస్తానని కూడా నవ్వతూ చెప్పారు.

జగదేకవీరుడు అతిలోకసుందరి పార్ట్ 2 గురించి ఏనాటి నుంచో డిస్కషన్‌ అయితే విరివిగా జరుగుతోంది గానీ, దానికి సంబంధించిన అప్‌డేట్స్ మాత్రం ఎక్కడా ఎప్పుడూ రాలేదు. ఆరోజుల్లో అంత వరకూ తెలుగు సినిమాకి తెలియని బడ్జెట్‌తో, గ్రాండ్‌ సెట్స్‌తో, అద్భుతమైన మ్యూజిక్‌తో మెగాస్టార్‌ చిరంజీవి(chiranjeevi), ఆలిండియా సూపర్‌స్టార్‌ శ్రీదేవి(sridevi) కాంబినేషన్‌లో వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పైన అశ్వనీదత్‌ నిర్మించిన ఈ ఫాంటసీ చిత్రం నాటికీ, నేటికీ కూడా ఎవ్వరూ అనుకరించలేని, అనుసరించలేని తిరుగులేని చిత్రంగా చారిత్రక చిత్రంగా అలా నిలిచిపోయింది.

అశ్వనీదత్‌కీ తన మేగ్నమ్‌ ఓపస్‌కి సీక్వెల్‌ చెయ్యాలన్న పట్టుదల ఉన్నా, దానికి తగిన సరైన ప్లాట్‌పార్మ్ మాత్రం ఏ కారణం చేతనైనా సరే కరెక్టుగా సెట్‌ కాలేదు. ముఖ్యంగా కథ సమకూరాలి, దానికి తగిన స్టార్‌ సెటప్‌ కుదరాలి ఇవన్నీ అనుకోగానే జరిగే వ్యవహారాలు కావు. అందుకే అశ్వనీదత్‌ కూడా ఈ ప్రాజెక్టుపైన ఆసక్తిని తగ్గించుకోకుండా ఎప్పటికప్పుడు ప్రయత్నాలైతే సాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆగ్నికి ఆజ్యం పోసినట్టుగా, అశ్వనీదత్‌ గారిలో ఉన్న మేకింగ్ పేషన్‌ని అక్షరాల పుణికి పుచ్చుకుని హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న దత్‌ సిస్టర్స్‌కి మాత్రమే సాధ్యమైన ఫీట్‌ ఇది.
రాబోయే కాలంలో ఏదో ఒక రోజున జగదేకవీరుడు-ఆతిలోకసుందరికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ సడన్‌గా వచ్చినా ఆశ్చర్యం ఏమీ లేదు. ఉండదు. "Written by Nagendra Kumar"

Updated On 9 May 2023 1:18 AM GMT
Ehatv

Ehatv

Next Story