తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఆశీర్వాదాలు తీసుకున్నారు ప్రముఖ కొరియోగ్రఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాఘవా లారెన్స్(Raghava Lawrence). కారణం ఏంటంటే..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఆశీర్వాదాలు తీసుకున్నారు ప్రముఖ కొరియోగ్రఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాఘవా లారెన్స్(Raghava Lawrence). కారణం ఏంటంటే..?

తమిళ సూపర్ స్టార్, రజనీకాంత్ ను హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ కలిశారు. చెన్నైలోని రజినీ నివాసానికి వెళ్లిన లారెన్స్... ఆయన కాళ్లు మొక్కి మరీ ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో(Social media) శేర్ చేశారు రాఘవ. తన గురువు తలైవా రజనీకాంత్ సార్ ను కలిశానని ట్విట్టర్ వేదికగా లారెన్స్ తెలిపారు. 'జైలర్' సినిమా సూపర్ హిట్ అయినందుకు అభినందనలు తెలిపానని చెప్పారు.

అంతే కాదు అసలు ఆయన రజినీకాంత్ కు కలవడానికి కారణం.. 'చంద్రముఖి-2 సినిమా రిలీజ్. ఈసినిమా రిలీజ్ నేపథ్యంలో సార్ ఆశీర్వాదం తీసుకున్నానని... చాలా సంతోషంగా ఉందని అన్నారు లారెన్స్. రజనీ సార్ చాలా గొప్ప వ్యక్తి .. ఆయన నాకు గురువు.. 'గురువే శరణం' అని రాసుకొచ్చారు. ఇక ఈ సినిమా షూటింగ్‌కు ముందు కూడా ఇలానే రజనీను కలిసి ఆయన నుంచి ఆశీస్సులు తీసుకున్నాడు రాఘవా లారెన్స్.

ఇక మరో రోజుల్లో రిలీజ్‌ కాబోతున్న చంద్రముఖి సీక్వెల్‌పై జనాల్లో మాములు అంచనాల్లేవు. తొలి ట్రైలర్‌ జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. రీసెంట్‌గా రిలీజైన సెకండ్ ట్రైలర్‌ మంచి హైప్‌ను తీసుకొచ్చింది. లారెన్స్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు వాసు.పి దర్శకుడు. కంగనా రనౌత్‌, ఎమ్‌.ఎమ్‌ కీరవాణి వంటి దిగ్గజాలు సినిమాలో భాగం కావడంతో సీక్వెల్ పార్టుపై జనాల్లో తిరుగులేని అంచనాలున్నాయి.

Updated On 27 Sep 2023 1:45 AM GMT
Ehatv

Ehatv

Next Story