సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Super Star Rajinikanth) హీరోగా వచ్చిన చంద్రముఖి(Chandramukhi) సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చంద్రముఖికి సీక్వెల్‌గా చంద్రముఖి 2 రాబోతున్నది. చంద్రముఖికి దర్శకత్వం వహించిన పి.వాసునే దీనికి దర్శకుడు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Super Star Rajinikanth) హీరోగా వచ్చిన చంద్రముఖి(Chandramukhi) సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చంద్రముఖికి సీక్వెల్‌గా చంద్రముఖి 2 రాబోతున్నది. చంద్రముఖికి దర్శకత్వం వహించిన పి.వాసునే దీనికి దర్శకుడు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నటుడిగా, కొరియగ్రాఫర్‌గా సుపరిచితుడైన రాఘవా లారెన్స్‌(Raghava Lawrence) ఇందులో కథానాయకుడిగా నటిస్తుంటే, బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut)
ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ను కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ సింగిల్‌ స్వాగతాంజలి పాటతో పాటు సెకండ్ సింగిల్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఆగస్టు 26న చంద్రముఖి 2 ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు రాఘవా లారెన్స్‌ తెలుపుతూ తన కొత్త లుక్‌ను అందరితో షేర్‌ చేసుకున్నాడు. ఇప్పుడీ లుక్స్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈవెంట్‌ నేపథ్యంలో మీ ఆశీస్సులు కావాలని అభిమానులను, శ్రేయోభిలాషులు, సినిమా ప్రేమికులను లారెన్స్‌ కోరాడు. ఈ సినిమాకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు విజేత, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరులో జాతీయ అవార్డును గెల్చుకున్న లెజెండరీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోరును అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే లాంఛ్‌ చేసిన పోస్టర్లు, టైటిల్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చంద్రముఖి 2 లో లెజెండ‌రీ కమెడియ‌న్ వడివేలు ప్రధానపాత్రను పోషిస్తున్నారు. కాగా చంద్రముఖి 2 సెప్టెంబర్ 15వ తేదీన తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Updated On 25 Aug 2023 2:54 AM GMT
Ehatv

Ehatv

Next Story