తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth), ప్రభు(Prabhu), జ్యోతిక(Jyothika), నయనతార(Nayanthara) ప్రధానపాత్రలలో నటించిన చంద్రముఖి(Chandramukhi సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మలయాళంలో వచ్చిన మణిచిత్రతాజు ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. మాతృకకు మార్పులు చేర్పులు చేశారు. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన చంద్రముఖిని తెలుగులోనూ అదే పేరుతో డబ్‌ చేశారు.

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth), ప్రభు(Prabhu), జ్యోతిక(Jyothika), నయనతార(Nayanthara) ప్రధానపాత్రలలో నటించిన చంద్రముఖి(Chandramukhi సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మలయాళంలో వచ్చిన మణిచిత్రతాజు ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. మాతృకకు మార్పులు చేర్పులు చేశారు. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన చంద్రముఖిని తెలుగులోనూ అదే పేరుతో డబ్‌ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చాలు చాలామంది మిస్సవ్వకుండా చూస్తారు. 2005లో విడుదలైన ఈ సినిమాను దర్శకుడు పి.వాసు రూపొందించారు. దీనికి సీక్వెల్‌ చేయాలని పి.వాసు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్‌ ఒప్పుకోకపోవడంతో సీక్వెల్‌ కథతో తెలుగులో నాగవల్లి సినిమా చేశాడు. అది పెద్దగా ఆడలేదు. అసలు నాగవల్లీ అనే సినిమా వచ్చిందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు.

18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పడు మళ్లీ తమిళంలో చంద్రముఖి-2(Chandramukhi-2) సినిమా చేశారు పి.వాసు. ఇందులో రజనీకాంత్‌కు బదులుగా డాన్స్‌ డైరెక్టర్‌, హీరో లారెన్స్‌(Raghava Lawrence)నటించారు. బాలీవుడ్‌ సంచనల హీరోయిన్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. వడివేలు, రాధిక ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు లారెన్స్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. అందులో ఆయన చంద్రముఖి గది ద్వారం వద్ద నిలబడి.. తలుపు రంద్రం గుండా లోపలికి చూస్తూ కనిపించారు. భారతీయ సినిమా చరిత్రలో చంద్రముఖికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నామని, ఇది ప్రేక్షకుల అంచనాల్ని మించేలా ఉంటుందని నిర్మాత సుభాస్కరన్‌ తెలిపారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Updated On 30 Jun 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story